Oo Antava Brahmanandam Spoof: ఫన్నీ వీడియో: బ్రహ్మీతో ‘ఊ అంటావా..’ స్పూఫ్ సాంగ్.. దేవీశ్రీ ప్రసాద్ స్పందన ఇది!
‘ఊ అంటావా.. ’ సాంగ్‌లో మీరు కేవలం సమంతను మాత్రమే చూశారు. అదే పాటను బ్రహ్మానందం చేస్తే ఎలా ఉంటుందో చూడండి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మీక మందన్నా జంటగా నటిస్తున్న ‘పుష్ప: ద రైజ్’ సినిమా నుంచి శుక్రవారం ‘‘ఊ అంటావా.. ఊఊ అంటావా..’’ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. సమంతపై చిత్రించిన ఈ ఐటెమ్ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండవ్వుతోంది. అయితే, ఇదే పాటను ఓ నెటిజన్ బ్రహ్మానందం సీన్లతో రీమిక్స్ చేసి.. ట్వీట్ చేశాడు. అంతే.. క్షణాల్లో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఆ పాటను స్వరపరిచిన దేవీశ్రీ ప్రసాద్ కూడా రిట్వీట్ చేసుకున్నాడు.
‘‘This is Hilarious !!! Superrr Edit !!’’ అంటూ దేవిశ్రీ ఈ వీడియోను రీట్వీట్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజనులు.. రీట్వీట్ చేసుకుంటున్నారు. ఈ పాటను బ్రహ్మీ ఎక్స్‌ప్రెషన్స్‌తో భలే ఎడిట్ చేశారంటూ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్నంత సేపు మీరు కూడా నవ్వు ఆపుకోలేరు.
😂🤣😂🤣😂. This is Hilarious !!! Superrr Edit !! 😀😀😀👌🏻👌🏻👌🏻 https://t.co/Ii9AVEEamC
— DEVI SRI PRASAD (@ThisIsDSP) December 11, 2021
ఐటెమ్ సాంగ్స్‌పై ప్రత్యేక ఆసక్తి చూపించే దేవి శ్రీ ప్రసాద్ డిఫరెంట్ ట్యూన్‌తో వచ్చారు. తెలుగులో ఈ పాటను చంద్రబోస్ రాయగా.. ఇంద్రవతి చౌహన్ ఆలపించారు. తమిళంలో ఇదే పాటను సింగర్ అండ్ హీరోయిన్ ఆండ్రియా ఆలపించారు. కన్నడలో తెలుగమ్మాయి మంగ్లీ పాడారు. మలయాళంలో రమ్యా నంబీశన్ పాడారు. ఒక్కో భాషలో ఒకొక్కరి చేత దేవిశ్రీ పాటను పాడించారు.
#OoAntavaOoOoAntava #Brahmanandam Version
— DHK ™ (@Devineni_Hari) December 10, 2021
Credits : DJ Sai 🏃 ( Thammi ) pic.twitter.com/BW3972zLUB
Also Read: మావా... ఊ అంటావా? ఊ ఊ అంటావా? సమంత సాంగ్ వచ్చేసింది. చూశారా?
ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ నెల 17న విడుదల కానుంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, రావు రమేష్, అజయ్ ఘోష్, ధనుంజయ తదితరులు సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.
ప్రభాస్ వెర్షన్:
#OoAntavaOoOoAntava #Prabhas Version 🏃♂️#Billa #Pushpa pic.twitter.com/QORN5QlNKz
— DHK ™ (@Devineni_Hari) December 11, 2021
Also Read: హమ్మయ్య.. ఆ ‘శబ్దాలు’ తగ్గుతాయ్.. కత్రినా-విక్కీలపై అనుష్క కొంటె కామెంట్స్
Also Read: వరుణ్ తేజ్ 'గని' విడుదల వాయిదా... ఎందుకంటే?
Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?
Also Read: 'గమనం' రివ్యూ : సినిమా ఎలా ఉందంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి