By: ABP Desam | Updated at : 12 Dec 2021 07:23 PM (IST)
'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూసి రామ్, భీమ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా..?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా జనవరి 7న విడుదల కాబోతుంది. దీనికోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ ట్రైలర్ చూసిన అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా రాజమౌళిని పొగుడుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెట్టారు.
అయితే మొట్టమొదటిసారి ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలా రియాక్ట్ అయ్యారో ఓ వీడియోను షేర్ చేసింది 'ఆర్ఆర్ఆర్' టీమ్. ట్రైలర్ చూసిన వెంటనే రామ్ చరణ్.. రాజమౌళిని చాలా గట్టిగా హత్తుకున్నాడు. ఎన్టీఆర్ కూడా వెళ్లి వారిద్దరినీ కౌగిలించుకున్నాడు. 'ఏంటి అది.. అసలు ఏంటి అది..? ఇప్పుడు ఉంటాది ఆగండి ఒక్కొక్కరికీ అంటూ' ఎన్టీఆర్ డైలాగ్స్ కొడుతూ కనిపించారు. కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా అనే డైలాగ్ కి గూస్ బంప్స్ వచ్చాయని అన్నారు ఎన్టీఆర్. ఆ తరువాత రామ్ చరణ్ వెళ్లి రమా రాజమౌళి కూడా ప్రేమగా దగ్గర తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ సినిమాలో అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే మూడు పాటలను విడుదల చేశారు.అందులో 'నాటు నాటు' పాటలో హీరోలు ఇద్దరు వేసిన స్టెప్పులకు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. 'జనని...' సాంగ్ సినిమాలో ఎమోషన్ ఎలివేట్ చేసింది. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత.
Their reaction is priceless… 🤩
Our BHEEM & RAM reacting to #RRRMovie Trailer after watching it for the first time ❤️@ssrajamouli @tarak9999 @alwaysramcharan #RRRTrailer - https://t.co/I1AdSVDSX4 💥 pic.twitter.com/0XEWrk1IIa— RRR Movie (@RRRMovie) December 12, 2021
Also Read: 'నువ్ నన్ను భరించావా..? లేక నటించావా..?' మానస్ ని ప్రశ్నించిన పింకీ..
Also Read: రజనీకాంత్ పవర్ఫుల్ పంచ్‌లకు ఎవరైనా పడిపోవాల్సిందే... కొన్ని డైలాగులు ఇవిగో
Also Read: ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Akhil Mishra Death : హైదరాబాద్‌లో ప్రమాదవశాత్తూ బాలీవుడ్ యాక్టర్ మృతి
WhatsApp Channel : వాట్సాప్ ఛానల్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ ప్రముఖులు ఎవరు? ఎవరి ఫాలోయింగ్ ఎంత?
Shobha Shetty: 'ఘాటెక్కిన' బిగ్ బాస్ హౌస్ - స్పైసీ చికెన్ టాస్క్ లో ఏడ్చేసిన శోభా శెట్టి
Atlee: హీరో విజయ్ దళపతి నన్ను నమ్మలేదు- దర్శకుడు అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Trinayani September 21st Episode:సుమనకు ఆస్తి ఇవ్వనని చెప్పేసిన నయని - చిన్నారికి పేరు వెతుకుతున్న సుమన!
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టైఫాయిడ్‌తో రిమాండ్ ఖైదీ మృతి- చంద్రబాబు భద్రతపై లోకేష్ అనుమానం
AP Assembly Sessions 2023: దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్- అదే స్థాయిలో రియాక్ట్ అయిన బాలకృష్ణ- సభ వాయిదా
కెనడాలోని హిందువులంతా జాగ్రత్త, దాడులు జరిగే ప్రమాదముంది - కెనడా ఎంపీ హెచ్చరికలు
బస్సు యాత్రకు సిద్ధమైన కాంగ్రెస్- స్క్రీనింగ్ కమిటీలో యాష్కీ, కోమటిరెడ్డి
/body>