(Source: ECI/ABP News/ABP Majha)
సిరివెన్నెలకు గూగుల్ నివాళి.. Ok Google, Play Sirivennela Songs
సిరివెన్నెల సీతారామశాస్త్రికి గూగుల్ నివాళులు అర్పించింది. ఆయన పాటల కోసం గూగుల్‌లో Ok google, play Sirivennela Songs అని అడిగితే చాలు.
అక్షర బ్రహ్మ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరనే సంగతిని సాహిత్య ప్రపంచం జీర్ణించుకోలేకపోతుంది. తూటాల్లాంటి పాటలను స్మరిస్తూ.. మరోసారి ఆయన్ని గుర్తుతెచ్చుకుంటోంది. ఆయన మరణం.. ఆ ‘గూగుల్’ తల్లి మనసు కూడా కరిగించిందో ఏమో. ఆయన కోసం ప్రత్యేకంగా ట్వీట్ చేసి మరీ నివాళులు అర్పించింది. Ok Google, Play Sirivennela Songs అంటూ ఆయన పాటలను వింటూ బాధను మరిచిపోమని చెబుతోంది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మాటల్లో చెప్పలేం. ఆయనంత గొప్పగా పాటల్లోనూ వర్ణించలేం. ఎందుకంటే.. ఆయన గురించి చెప్పాలంటే.. ఈ జీవితం సరిపోదు. ఆయన పాటల్లో ఆణిముత్యాలు కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆయన రాసిన ప్రతి పాట ఆణిముత్యమే. మీరు ఆయన పాటలను వినాలంటే.. సింపుల్‌గా గూగుల్‌లోకి వెళ్లి.. ‘ప్లే సిరివెన్నెల సాంగ్స్’ అని అంటే చాలు.. ఆయన పాటలను వినొచ్చు.
సిరివెన్నెల మరణవార్త తర్వాత గూగుల్‌లో ఆయన గురించి చాలా మంది సోదించారు. ఈ సందర్భంగా గూగుల్ కూడా తెలుగువారి మనసును అర్థం చేసుకుని.. ‘‘సిరివెన్నెలతో మొదలైన జీవన గీతం.. సీతారామశాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం’’ అంటూ ఈ ట్వీట్ చేసింది. దీన్ని మన తెలుగు నెటిజన్స్ కూడా రీట్వీట్ చేసుకుంటూ.. గూగుల్‌కు థాంక్స్ చెబుతున్నారు.
Ok Google, play Sirivennela songs 😞💔
— Google India (@GoogleIndia) November 30, 2021
"సిరివెన్నెల" తో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం 🙌
అనారోగ్య సమస్యలతో ఇటీవల కిమ్స్ ఆస్పత్రిలో చేరిన 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఈ నెల 22న ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన కోలుకుంటారని, మరెన్నో పాటలు తమకు అందిస్తారని ఆశించిన తెలుగువారికి సిరివెన్నెల మరణం విషాదకరం.. నేటి మధ్యాహ్నం మహా ప్రస్థానంలో సిరివెన్నెల అంతిమ సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Also Read: ‘సిరి వెన్నెల’ సూపర్ హిట్ సాంగ్స్.. ఈ పాటల్లో సాహిత్యం వింటే ప్రాణం పరవశిస్తుంది
Also Read: మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి!
Also Read: సిరివెన్నెల రాసిన ఈ రెండు పాటలే చివరివి... ఆర్ఆర్ఆర్‌లో ఆ పాట కూడా...
Also Read: 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి ఇక లేరు.. సాహిత్యానికి ముందు సాధారణ వ్యక్తిగా..
Also Read: సిరివెన్నెల పాట.. ప్రశ్నించే తూటా..
Also Read: వేల పాటలు రాసిన సిరివెన్నెలకు నచ్చిన పాట ఏది? నెటిజన్ల ముచ్చట్లలో ఏం చెప్పారు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి