అన్వేషించండి

Vijay Deverakonda Rashmika : రణబాలి కొత్త షెడ్యూల్‌కు కొత్త జంట - విజయ్ దేవరకొండ, రష్మిక కపుల్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే?

Virosh Couple : పెళ్లి తర్వాత విరోష్ కపుల్ 'రణబాలి' మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్‌లో పెళ్లి తర్వాత కొత్త జంట షూటింగ్‌లో పాల్గొననున్నారు.

Virosh Couple Resuming Ranabaali Shoot After Marriage : స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక కపుల్ పెళ్లి తర్వాత తిరిగి 'రణబాలి' మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి హడావిడి ముగియడంతో కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని రెగ్యులర్ వర్క్స్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం.

14 రోజుల తర్వాత

రాజస్థాన్ ఉదయ్ పూర్‌లో ఫిబ్రవరి 26న విజయ్, రష్మిక జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ నెల 4న హైదరాబాద్ తాజ్ హోటల్‌లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఫ్యామిలీస్‌తో పాటు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ హాజరయ్యారు. 

పెళ్లైన దాదాపు 2 వారాల తర్వాత విరోష్ ఇద్దరూ కలిసి 'రణబాలి' షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో ఇది మూడో మూవీ. ఇద్దరూ సినిమాలోనూ దంపతులుగానే నటిస్తున్నారు. ఈ నెల 9 నుంచి 'రణబాలి' షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుండగా... 12 నుంచి కొత్త జంట పాల్గొననున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత న్యూ కపుల్ చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. వీరి పెళ్లి సందర్భంగా 'రణబాలి'లో విరోష్ జంటపై రిలీజ్ చేసిన సాంగ్ వైరల్ అవుతోంది.

Also Read : తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్

గంభీరమైన లుక్‌లో 'రణబాలి'గా విజయ్ దేవరకొండ, అమాయకమైన అందమైన లుక్‌లో అతని భార్య జయమ్మగా రష్మిక లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బ్రిటిష్ కాలం నాటి ఆ పాత తరం లుక్‌ను 100 శాతం రీక్రియేట్ చేయడం వైరల్‌గా మారింది. 'ఏందయ్యా సామీ...' అంటూ అమాయక వివాహిత తన భర్తపై చూపించే ప్రేమను అద్భుతంగా ఈ పాటలో వ్యక్తం చేశారు. 

ముచ్చటగా మూడోసారి...

'గీత గోవిందం' మూవీతో విజయ్ దేవరకొండ, రష్మిక బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు. ఆ టైంలోనే ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం సాగింది. ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ మూవీలోనూ ఇద్దరూ జంటగా నటించారు. ఈ రెండు మూవీస్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి 'రణబాలి' కోసం విరోష్ కపుల్ జత కట్టబోతున్నారు.

ఈ మూవీకి 'టాక్సీవాలా' ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. విజయ్, రష్మికలతో పాటు బ్రిటిష్ అధికారిగా ఆర్నాల్డ్ వోస్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అజయ్ అతుల్ మ్యూజిక్ అందిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా 'రణబాలి' మూవీని రూపొందించినట్లు అనౌన్స్‌మెంట్ వీడియోను బట్టి తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక విజయ్ దేవరకొండ 'రణబాలి'తో పాటే రవి కిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్ధన'లోనూ నటిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అటు, రష్మిక 'మైసా' మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వారియర్‌గా నేషనల్ క్రష్ కనిపించనున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Editor Madhu Reddy: తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
Pradeep Ranganathan: విఘ్నేష్ శివన్ సినిమాతో హిట్ రాలేదు... మరో సీనియర్‌కు ప్రదీప్ రంగనాథన్‌ ఛాన్స్ ఇస్తాడా?
విఘ్నేష్ శివన్ సినిమాతో హిట్ రాలేదు... మరో సీనియర్‌కు ప్రదీప్ రంగనాథన్‌ ఛాన్స్ ఇస్తాడా?
Mahavatar Parashuram: నరసింహ తర్వాత మహా అవతార్ పరశురామ్... రిలీజ్ ఎప్పుడంటే?
నరసింహ తర్వాత మహా అవతార్ పరశురామ్... రిలీజ్ ఎప్పుడంటే?
Chiranjeevi On Pawan Kalyan Surgery: కళ్యాణ్ బాబు సేఫ్... తమ్ముడి హెల్త్‌పై అన్నయ్య చిరంజీవి మెగా అప్డేట్
కళ్యాణ్ బాబు సేఫ్... తమ్ముడి హెల్త్‌పై అన్నయ్య చిరంజీవి మెగా అప్డేట్
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PBKS Hat-Trick Wins IPL 2026: పంజాబ్ న‌యా రికార్డు.. అన్ బీటెన్ గా నిలిచి కొత్త ఘ‌న‌త‌.. రాణించిన ఆర్య‌, కాన్లీ, యాన్సెన్, ల‌క్నో చిత్తు
పంజాబ్ న‌యా రికార్డు.. అన్ బీటెన్ గా నిలిచి కొత్త ఘ‌న‌త‌.. రాణించిన ఆర్య‌, కాన్లీ, యాన్సెన్, ల‌క్నో చిత్తు
US Iran Ceasefire: అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
Anshu Roja Selvamani: రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి
రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
PM Modi Viral Video: సామాన్యుడిలా దుకాణం వద్ద రూ. 10 కి ఝాల్ ముడీ కొని తిన్న ప్రధాని నరేంద్ర మోదీ
సామాన్యుడిలా దుకాణం వద్ద రూ. 10 కి ఝాల్ ముడీ కొని తిన్న ప్రధాని నరేంద్ర మోదీ
Editor Madhu Reddy: తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
తెలుగు చిత్రసీమలో విషాదం... గుండెపోటుతో యంగ్ ఎడిటర్ మృతి
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Blast At Firecracker Factory: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
Embed widget