Tollywood Drugs : టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు క్లోజ్ .. ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది !?

టాలీవుడ్ ప్రముఖులందరూ డ్రగ్స్ కేసులో క్లీన్‌గా బయటకు వచ్చారు. ఇప్పటికే తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు క్లీన్ చిట్ ఇవ్వగా.. ఇప్పుడు ఈడీ కూడా మరకలేం లేవని తేల్చేసింది.

FOLLOW US: 


టాలీవుడ్‌కు డ్రగ్స్ మరక పూర్తిగా తొలగిపోయినట్లయింది. ఇప్పటి వరకూ ఆయా తారలపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఓ వైపు తెలంగాణ పోలీసులు ఆధారాల్లేవని కోర్టుకు తేల్చి చెబితే.. అనూహ్యంగా మధ్యలో విచారణ ప్రారంభించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ కూడా ఎలాంటి ఆధారాలు లేవని.. తమ కేసును కూడా క్లోజ్ చేస్తోంది. దీంతో నాలుగేళ్లకుపైగా మానసికంగా ఇబ్బంది పడుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తారలకు రిలీఫ్ లభించినట్లయింది. 

Also Read : 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌లో రాజమౌళి చూపించబోయేది ఇదే... మళ్లీ సేమ్ స్ట్రాటజీ!

2017 నుంచి టాలీవుడ్‌ను వెంటాడుతున్న డ్రగ్స్ కేసు ! 

2017లో  ఓ హీరో సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. దాన్ని విశ్లేషించిన తర్వాత  డ్రగ్స్ కేసులను బయటకు తీశారు. రవితేజ తగ్గర్నుంచి పూరి జగన్నాథ్ వరకు చార్మీ దగ్గర్నుంచి ముమైత్ ఖాన్ వరకూ... అరవై మందికిపైగా టాలీవుడ్ ప్రముఖులను పోలీసులు విచారించారు. దాదాపుగా అందరి దగ్గర్నుంచి గోళ్లు, వెంట్రుకలు తీసుకున్నారు. వాళ్లు డ్రగ్స్ వాడారో లేదో తేల‌్చేస్తామని సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ నేతృత్వంలోని విచారణ బృందం ప్రకటించింది.  దాదాపుగా అందర్నీ విచారించిన తర్వాత వారి శాంపిల్స్ పంపాల్సిన చోటికి పంపిన తర్వాత కేసు సైలెంటయిపోయింది. 

Also Read: రాజమౌళి మూడు గంటల సినిమా తీశారా? 'ఆర్ఆర్ఆర్' రన్ టైమ్ ఎంత?

నిన్నామొన్నటిదాకా చార్జిషీట్లే దాఖలు చేయలేదు..! 

ఆ తర్వాత 2018 జూలైలో నలుగురు సినీ సెలబ్రిటీలపై ఆధారాలు దొరికాయని వారి గోళ్లు, వెంట్రుకల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయని మీడియాకు లీక్ ఇచ్చారు. కానీ తర్వాత  మళ్లీ సైలెంటయ్యారు.  ఆ కేసులన్నీ ఏమైపోయాయనే అంశంపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ సమాచార రక్కు చట్టం కింద  ఎక్సైజ్‌శాఖకి దరఖాస్తు చేసి వివరాలు సేకరించింది. 2020 సెప్టెంబర్‌ వరకూ చార్జిషీట్లు దాఖలు చేయలేదు. వివిధ డ్రగ్స్ కేసులలో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నట్లుగా చెప్పారు కానీ సినీ ప్రముఖుల పేర్లు బయట పెట్టలేదు. దీంతో వారందరికీ అప్పట్లో క్లీన్ చిట్ ఇచ్చనట్లుగా స్పష్టమయింది. 

Also Read: 'జనని...' పాటకు జీవం పోసిన పాత్రలు ఇవే!

అనూహ్యంగా ఈడీ ఎంట్రీ ..! 

టాలీవుడ్  డ్రగ్స్ కేసులో అనూహ్యంగా ఈడీ ఎంట్రీ కావడం సంచలనం సృష్టించింది. గత ఆగస్టులో గతంలో విచారణకు హాజరైన వారిలో పూరి జగన్నాథ్, తరుణ్ , చార్మీ, నందు, రానా, రవితేజ సహా 11 మంది ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. నాలుగేళ్ల క్రితం నాటి కేసు.. అదీ కూడా తెలంగాణ పోలీసులు దాదాపుగా క్లీన్ చిట్ ఇచ్చిన కేసులో  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నుంచి సినీ ప్రముఖులకు నోటీసులు అందడం సంచలనాత్మకం అయింది. డ్రగ్స్ కొనుగోలు , అమ్మకాల వ్యవహారాల్లో జరిగే నగదు లావాదేవీలు అక్రమం. ఆ కోణంలోనే దర్యాప్తు ప్రారంభించిందని అనుకున్నారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేసిందని అనుకున్నారు. 

Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన

ఈడీ విచారణ చేస్తూండగానే అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసిన తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ! 

ఓ వైపు ఈడీ టాలీవుడ్ సెలబ్రిటీల్ని విచారిస్తూండాగానే ఎవరిపైనా బలమైన ఆధారాలు లేవని కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. డ్రగ్స్‌ కేసులో కెల్విన్ ఇచ్చిన స్టేట్‌మెంట్లలో అనేక మంది సెలబ్రిటీల పేర్లు ఉన్నప్పటికీ తప్పుదోవ పట్టించడానికే అలా చెప్పారని తెలంగాణ ఎక్సైజ్ శాఖ కోర్టుకు చెప్పింది.  సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించినట్లు ఆధారాలు కూడా లేవన్నారు.  నిందితుడు కెల్విన్ చెప్పిన విషయాలను ఆధారాలుగా భావించలేమని ఛార్జిషీటులో పోలీసులు స్పష్టం చేశారు. వారి నుంచి సేకరించిన శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు కూడా లేవని కోర్టుకు నివేదిక సమర్పించారు. కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ప్రస్తుతం ఈడీ కేసును దర్యాప్తు చేసింది.   తెలంగాణ పోలీసులే తేల్చేయడంతో ఈడీ కూడా ఏమీ చేయలేకపోయినట్లుగా తెలుస్తోంది. 

Also Read: డెసిషన్ మారలేదు... పుకార్లకు మరోసారి చెక్ పెట్టిన 'భీమ్లా నాయక్' ప్రొడ్యూసర్

తాజాగా ఈడీకీ దొరకని ప్రాథమిక ఆధారాలు.. కేసు క్లోజ్ ! 
 
సినీ తారలపై డ్రగ్స్ కేసుల్లో ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్న కారణంతో  ఆ కేసుల్ని ముగించేయాలని ఈడీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కెల్విన్ సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశాడని చెబుతున్నాడు కానీ దానికి ఆధారాలు లేవని తేల్చేశారు. దీంతో ఈడీకి కూడా ఏం చేయాలన్నదానిపై క్లూ లేకుండా పోయింది. ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ వాడలేదని కోర్టుకు చెప్పినప్పుడు డ్రగ్స్ కొన్నారని దాని కోసమే డబ్బు చెల్లించారని ఈడీ నిరూపించడం కష్టం సాధ్యంగా మారింది. ఎందుకంటే అసలు ఈడీ నమోదు చేసిన కేసే తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఆధారంగా చేసింది.  ఈడీ కూడా చివరికి ఏమీ లేదని తేల్చారు. దీంతో టాలీవుడ్‌కు నాలుగైదేళ్లుగా పట్టుకున్న డ్రగ్స్ టెన్షన్ తీరిపోయిటన్లయింది. 

Also Read: ఒక్కసినిమా కూడా కలిసి చేయలేదు, కేవలం ఆ ఒక్క మాటతో ప్రేమలో పడ్డారు... విక్కీ-కత్రినా లవ్ స్టోరీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 08 Dec 2021 12:26 PM (IST) Tags: celebrities ED tollywood drugs case Tollywood‌ Drugs Case Close Clean Chit

సంబంధిత కథనాలు

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!