Samantha: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకులపై సమంత స్పందన
అక్కినేని నాగచైతన్య, సమంత తమ విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విడాకులకు సమంతే కారణం అని పలువురు విమర్శించారు. ట్రోల్స్ చేశారు. వీటిపై సమంత స్పందించారు.
"నాకు తెలుసు... చాలామంది బాధపడ్డారు (అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న విషయాన్ని ఉద్దేశిస్తూ). అయితే... వాళ్ల బాధను వ్యక్తం చేయడానికి ఓ పద్ధతి అంటూ ఉండాలి" అని సమంత వ్యాఖ్యానించారు. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. వాళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అటువంటి జంట మధ్య మనస్పర్థలు వస్తాయని, వేరు పడతారని ఎవరూ అనుకోలేదు. అందువల్ల, వాళ్లిద్దరి విడాకుల వ్యవహారం చాలామందికి షాక్ ఇచ్చింది. అందరి కంటే పెద్ద షాక్ నెటిజన్స్ నుంచి సమంతకు తగిలింది.
విడాకులకు సమంతే కారణం అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. విమర్శించారు. సమంత వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి ట్రోల్స్ చేశారు. సమంతకు ఎవరితోనో ఎఫైర్ ఉందని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆ వదంతులను, పుకార్లను సమంత ఖండించారు. తాజాగా మరోసారి ఓ హిందీ మీడియాతో ఆ విమర్శలపై స్పందిస్తూ... "అభిమానుల ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలను. అయితే... దాన్ని మారో రూపంలో చెబితే బావుండేది. ట్రోల్స్ చేయకుండా" అని అన్నారు.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేరుగా స్టార్స్‌ను కామెంట్ చేసే, ట్రోల్స్ చేసే నెటిజన్స్ సంఖ్య పెరిగింది. స్టార్స్ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశిస్తున్నారు. దీనికి కారణం స్టార్స్ అనేది సమంత మాటలను బట్టి అర్థమవుతోంది. "అభిమానులు చూపించే ప్రేమ కోసం స్టార్స్ పరితపిస్తారు. ప్రతి విషయాన్నీ వాళ్లతో పంచుకుంటారు. నా వ్యక్తిగత విషయాల్ని వారితో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా. అలా చేయడం వల్ల... ఓ విధంగా అభిమానులు, ప్రేక్షకులను నా జీవితంలోకి ఆహ్వానించడమే" అని సమంత వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అభిమానులతోనూ తన ఏకాభిప్రాయం కుదరకపోవచ్చని సమంత అన్నారు. తన నిర్ణయాలు అన్నిటికీ అభిమానుల నుంచి బేషరతుగా మద్దతు లభించాలని, తన నిర్ణయాలను బేషరతుగా వాళ్లు అంగీకరించాలని కోరుకోవడం లేదని సమంత స్పష్టం చేశారు. అయితే... దారుణమైన వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదన్నారు. తొలుత కొంత బాధ పడినప్పటికీ... కొన్నేళ్లుగా అటువంటి విమర్శలు, వ్యక్తిగత దూషణలను తట్టుకునే శక్తిని అలవరచుకున్నానని సమంత తెలిపారు.
Also Read: 'యశోద'గా సమంత... సైలెంట్‌గా సెట్స్ మీదకు సినిమా!
అంచనాలు, ప్రణాళికలు తల్లకిందులు అవ్వడంతో వచ్చే ఏడాదిపై ఎటువంటి అంచనాలు పెట్టుకోలేదని సమంత అన్నారు. జీవితంలో ఏది వస్తే దాన్ని స్వీకరిస్తానని ఆమె తెలిపారు. వచ్చే ఏడాది సమంత నటించిన 'శాకుంతలం' విడుదల కానుంది. ఆ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తి చేసిన సమంత, సోమవారం 'యశోద' చిత్రీకరణ ప్రారంభించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
'ఫ్యామిలీ మేన్ 2' వెబ్ సిరీస్‌తో సమంత హిందీకి ఇంట్రడ్యూస్ కావడం, ఆమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా'లో ప్రత్యేక పాత్ర చేసిన నాగచైతన్య కూడా త్వరలో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళుతుండటంతో వీళ్లిద్దరి విడాకుల వ్యవహారం అక్కడ కూడా డిస్కషన్ పాయింట్ అయ్యింది.
Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి