Samantha: ఐదు భాషల్లో... 'యశోద'గా సమంత... సైలెంట్‌గా సెట్స్ మీదకు సినిమా!
'యశోద'గా సమంత ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదీ ఒకట్రెండు భాషల ప్రేక్షకులకు పరిమితం కాకుండా భారత దేశంలో అన్ని ప్రాంతాలకు చేరువయ్యేలా సినిమా ప్లాన్ చేశారు.
శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో సమంత ఓ సినిమా చేయనున్నారు. ఈ విషయం గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. అయితే... హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సైలెంట్‌గా స్టార్ట్ చేశారు. ఈ చిత్రానికి 'యశోద' టైటిల్ ఖరారు చేశారు. నేడు (డిసెంబర్ 06, సోమవారం) పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభించారు. పూజ చేసిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఒకట్రెండు భాషలకు పరిమితం కాకుండా దేశంలో అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు చేరువయ్యేలా ప్లాన్ చేశారు. "డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో షూటింగ్ చేసి, సినిమా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశాం" అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు.
నందమూరి బాలకృష్ణతో 'ఆదిత్య 369'తో పాటు మరో మూడు సినిమాలు నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్, శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా 'యశోద'ను నిర్మిస్తున్నారు. 'ఫ్యామిలీ మేన్ 2' వెబ్ సిరీస్‌తో సమంతకు నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది. కమర్షియల్ కథానాయికగా మాత్రమే కాకుండా డిఫరెంట్ రోల్స్ చేయగలనని ఆమె ప్రూవ్ చేసుకున్నారు. 'ఫ్యామిలీ మేన్ 2'తో సమంతకు వచ్చిన క్రేజ్‌కు తగ్గట్టు కథ, కథనాలు ఉండబోతున్నాయని సమాచారం.
'యశోద' హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోంది. దీనికి హరి - హరీష్ అని ఇద్దరు యువకులు దర్శకత్వం వహిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి పాటలు... పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి మాటలు అందిస్తుండగా... మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో 'చిలసౌ', 'రిపబ్లిక్' సినిమాలతో పాటు తమిళంలో 'మైనా', 'కుంకీ', 'గీతు', 'ధర్మదురై' తదితర సినిమాలకు పని చేసిన ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు విద్య శివలెంక లైన్ ప్రొడ్యూసర్, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్, చింతా గోపాలకృష్ణారెడ్డి సహ నిర్మాత.
Also Read: కన్నీళ్లు పెట్టుకున్న పూజా హెగ్డే... ఆలోచనలో పడ్డ ప్రభాస్!
Also Read: వెన్నుపోటు అంటేనే కళ్లల్లో నీళ్లొస్తున్నాయి... బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' టాక్
Also Read: విలన్‌గా నటించడానికి బాలకృష్ణ రెడీ! అయితే... ఓ కండీషన్!
Also Read: భీమ్... భీమ్... కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్టర్ చూశారా?
Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి