Balakrishna: వెన్నుపోటు అంటేనే కళ్లల్లో నీళ్లొస్తున్నాయి... బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' టాక్
'అన్ స్టాపబుల్' కార్యక్రమంలో 'వెన్నుపోటు' అంటూ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆయన ఏమన్నారంటే...
'ముఖ్యంగా తప్పుడు ప్రచారం... వెన్నుపోటు పొడిచారు అంటూ. చెబుతుంటే కళ్లలో నీళ్లు వస్తాయి. ఎందుకంటే... నేను ఆయన కొడుకుల్లో ఒకడిని, నేను ఆయన ఫ్యాన్స్‌లో ఒకడిని' - ఇవీ లేటెస్ట్ 'అన్ స్టాపబుల్' ప్రోమోలో నందమూరి బాలకృష్ణ చెప్పిన డైలాగులు. ఆయన ఇంత ఇలా ఆవేదన చెందడానికి కారణం ఉంది. ఎన్టీఆర్‌కు ఆయన కుటుంబ సభ్యులే వెన్నుపోటు పొడిచారని రాజకీయ ప్రత్యర్థులు కొందరు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ఆ ప్రచారం తారాస్థాయికి చేరింది.
ఎన్టీఆర్ కుమార్తె, నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ ఓ ఇంటర్వ్యూలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అదే విధంగా మాట్లాడారు. దానిపై చంద్రబాబు కంట తడి పెట్టుకున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎన్టీఆర్ కుమార్తెను చంద్రబాబు లాగారని కొందరు ఎదురుదాడి చేయడం ప్రారంభించారు. అయితే... చివరకు, వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన తప్పు ఒప్పుకొన్నా కొంతమంది విమర్శలు చేయడం ఆపలేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read: విలన్‌గా నటించడానికి బాలకృష్ణ రెడీ! అయితే... ఓ కండీషన్!
వెన్నుపోటు పొడిచారనేది తప్పుడు ప్రచారం అని బాలకృష్ణ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అటువంటి వ్యాఖ్యల గురించి చెబుతుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆయన ఆవేదన చెందారు. తండ్రి అంటే తనకు ఎంత గౌరవం అనేది బాలకృష్ణ చెప్పారు. తండ్రి గురించి ఆయన ఎప్పుడూ గొప్పగా చెబుతారు. తాజాగా "నేను ఆయన (ఎన్టీఆర్) కొడుకుల్లో ఒకడిని, అభిమానుల్లో ఒకడిని" మరోసారి చెప్పారు. బాలకృష్ణ చెప్పినది విన్న తర్వాత తప్పుడు ప్రచారానికి రాజకీయ నాయకులు ముగింపు పలుకుతారో? లేదో? చూడాలి.
'అన్ స్టాపబుల్' లేటెస్ట్ ప్రోమో:
Also Read: భీమ్... భీమ్... కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్టర్ చూశారా?
Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: హీరోయిన్‌కు రంగు తెచ్చిన సమస్య... దాన్నుంచి బయట పడటం కోసం!
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: బైక్ ఫైట్, టార్చర్ సీక్వెన్స్.. 'పుష్ప'లో కేక పెట్టించే సీన్స్ ఇవే..
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి