Pushpa: బైక్ ఫైట్, టార్చర్ సీక్వెన్స్.. 'పుష్ప'లో కేక పెట్టించే సీన్స్ ఇవే..
'పుష్ప' సినిమాలో కొన్ని సన్నివేశాలు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయట. అవేంటంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో పదేళ్ల తర్వాత వస్తున్న సినిమా 'పుష్ప'. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 17న సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. రేపే సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయట. సినిమా టీజర్, ట్రైలర్ టీజ్ చూస్తుంటే ఆ విషయం క్లియర్ గా తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బైక్ రైడింగ్ సీన్ ఒకటి హైలైట్ గా నిలవబోతుందట. నల్లమల్ల ఫారెస్ట్ లో కొందరు గూండాలు పుష్పరాజ్ వెంటపడడం, వాళ్లను తప్పించుకుంటూ హీరో బైక్ డ్రైవ్ చేస్తూ, ఫైట్ చేసే సన్నివేశం ఫ్యాన్స్ కు చాలా థ్రిల్లింగా అనిపిస్తుందట.
దీంతో పాటు సినిమాలో మరో సీన్ కూడా హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. అదేంటంటే.. హీరోని పోలీసులు అదుపులోకి తీసుకొని టార్చర్ చేసే సీన్. అడవిలో ఎర్ర చందనం ఎక్కడ దాచాడో తెలుసుకోవడానికి పుష్ప రాజ్ ని పోలీసులు హింస పెడతారట. ఈ సన్నివేశంలో బన్నీ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఈ విషయాలు సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. మరి సుకుమార్ ఆ అంచనాలను ఎంతవరకు అందుకోగలడో చూడాలి.
రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ లో కనిపించనుంది. ప్రస్తుతం ఈ ఐటెం సాంగ్ కి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మరో రెండు రోజుల్లో ఈ సాంగ్ షూటింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత మరింత అగ్రెసివ్ గా ప్రమోషన్స్ షురూ చేస్తారు. హైదరాబాద్ లోనే గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.
Also Read:ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్ ను అడ్డుకున్న అధికారులు.. కారణమిదే..
Also Read: 'హరిహర వీరమల్లు'.. జాక్వెలిన్ అవుట్.. నర్గీస్ ఫక్రీ ఇన్..
Also Read: బాలీవుడ్ లో 'అఖండ' రీమేక్.. హీరో ఎవరంటే..?
Also Read: అనసూయ ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ యాంకర్
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
Also Read: సిరివెన్నెలకు నా ముద్దు, ఆర్జీవీ ఎమోషనల్ పోస్టు, పాట పాడి మరీ...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి