Jacqueline Fernandez: ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్ ను అడ్డుకున్న అధికారులు.. కారణమిదే..
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను ముంబై ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. దానికి కారణమేంటంటే..?
ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను ముంబై ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆమెపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లుకౌట్ నోటీసులు జారీ చేయడమే దానికి కారణమని తెలుస్తోంది. 200 కోట్ల రూపాయల చీటింగ్, మనీలాండరింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ డేటింగ్ చేయడంతో ఈడీ అధికారులు ఆమెని కూడా విచారిస్తున్నారు.
ఇంకా విచారణ పూర్తికాకపోవడంతో ఆమె ఇండియాను విడిచిపెట్టి బయట దేశాలకు వెళ్లడానికి వీల్లేదు. కానీ ఆ రూల్స్ ను పక్కన ఈరోజు ఫారెన్ కు వెళ్లాలని బయలుదేరిన జాక్వెలిన్ కి ఈడీ రూపంలో పెద్ద షాకే తగిలింది. ఇమిగ్రేషన్ అధికారులు ఈ విషయాన్ని ఈడీ అధికారులకు తెలియజేశారు. వారు జాక్వెలిన్ ని ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లిపొమ్మని చెప్పడం కానీ లేదంటే అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదర్కొంటూ జైలులో ఉన్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ సన్నిహితంగా ఉండేది. వీరిద్దరికి సంబంధించిన ముద్దు సెల్ఫీలు కూడా బయటకొచ్చాయి. కానీ జాక్వెలిన్ మాత్రం అతడితో డేటింగ్ చేయలేదని చెబుతోంది. ఆ సంగతి పక్కన పెడితే.. జాక్వెలిన్ కి సుఖేష్ పది కోట్ల విలువైన బహుమతులు ఇచ్చాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది. జాక్వెలిన్ కి అతడు ఇచ్చిన ఖరీదైన బహుమతులలో ఓ గుర్రం కూడా ఉందట. దానికి విలువ రూ.51 లక్షలు.
అలానే ఓ పిల్లిని కూడా గిఫ్ట్ గా ఇచ్చాడట. దానికి విలువ సుమారు పది లక్షల రూపాయలు. జాక్వెలిన్ తో పాటు మరో నటి నోరా ఫతేహి కూడా సుఖేష్ నుంచి గిఫ్ట్ లు అందుకున్నట్లు ఈడీ వెల్లడించింది. ఆమెకి సుమారుడు కోటి విలువైన గిఫ్ట్ లు ఇచ్చాడట. అందులో ఐఫోన్, బీఎండబ్ల్యూ కారు ఉన్నట్లు సమాచారం.
Also Read: 'హరిహర వీరమల్లు'.. జాక్వెలిన్ అవుట్.. నర్గీస్ ఫక్రీ ఇన్..
Also Read: బాలీవుడ్ లో 'అఖండ' రీమేక్.. హీరో ఎవరంటే..?
Also Read: అనసూయ ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ యాంకర్
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
Also Read: సిరివెన్నెలకు నా ముద్దు, ఆర్జీవీ ఎమోషనల్ పోస్టు, పాట పాడి మరీ...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి