Vicky-Katrina love story: ఒక్కసినిమా కూడా కలిసి చేయలేదు, కేవలం ఆ ఒక్క మాటతో ప్రేమలో పడ్డారు... విక్కీ-కత్రినా లవ్ స్టోరీ
కత్రినా-విక్కీల పెళ్లి ఇప్పుడు ఇండియాలో టాప్ ట్రెండింగ్. అసలు వీరి ప్రేమ ఎప్పుడు మొదలైందో తెలుసా?
కత్రినా-విక్కీ కౌశల్ జంట ఎలా కలిసిందో, ఎప్పుడు ప్రేమలో పడిందో వారి అభిమానులకే కాదు, ఎవరికీ అర్థం కాలేదు. నేరుగా పెళ్లి వార్తే వినడంతో కత్రినా, విక్కీ ఫ్యాన్స్ తో పాటూ బాలీవుడ్ జనాలంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ వీరి ప్రేమప్రయాణానికి పునాది పడింది ఎక్కడో తెలుసా? ఓ టాక్ షోలో. ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ మూడేళ్ల క్రితం ‘కాఫీ విత్ కరణ్’ అనే టాక్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ షోకు ఓసారి కత్రినా అతిథిగా వచ్చింది. ఆ షోలో కరణ్, కత్రినాను ‘తరువాతి సినిమా ఎవరితో చేయాలనుకుంటున్నారు’ అని అడిగాడు. దానికి కత్రినా ‘ఆన్‌స్క్రీన్ లో నేను, విక్కీ కౌశల్ జంట బావుంటుంది’ అని సమాధానం ఇచ్చింది.
టాక్ షోలే కారణం...
కొన్ని ఎపిసోడ్ ల తరువాత అదే కార్యక్రమానికి విక్కీ కౌశల్ కూడా అతిధిగా వచ్చాడు. కరణ్, కత్రినా చెప్పిన విషయాన్ని విక్కీతో పంచుకున్నాడు. విక్కీ ఆశ్చర్యం, ఆనందంతో కళ్లు తిరిగి పడిపోయినట్టు నటించాడు. అప్పటికీ వారికింకా నేరుగా పరిచయం కాలేదు. కానీ విక్కీకి కత్రినాపై అభిమానం మొదలైంది. తాను కూడా కత్రినాతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఆ తరువాత వీరిద్దరితో కలిసి ‘ఫిల్మ్ కంపెనియన్’ అనే సంస్థ ‘టేప్ కేస్ట్’ అనే ఒక టాక్ షోను నిర్వహించింది. 23 నిమిషాల పాటూ సాగే ఎపిసోడ్ అది. అందులో టేప్ కాస్ట్ వాళ్లు రేడియో ద్వారా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఆ ప్రశ్నలు దాదాపు ఫ్యామిలీ, స్నేహితులు, స్టార్ డమ్, అనుభవాలు పంచుకోవడం ఇలానే ఉండడంతో వారిద్దరూ చాలా షేర్ చేసుకున్నారు. అందులోనూ మధ్యలో యాంకర్ ఎవరూ ఉండరు కాబట్టి ఇద్దరూ చక్కగా కలిసిపోయి కార్యక్రమాన్ని నడిపించారు. ఆ తరువాతే ఒకరినొకరు ఇష్టపడడం మొదలుపెట్టారని టాక్. ఈ కార్యక్రమంలో ఒక సినిమాలో కలిసి చేయని నటీ నటులను పిలిచి వారిద్దరితో టాక్ షో నిర్వహించడం ‘టేప్ కాస్ట్’ ప్రత్యేకత. కత్రినా- విక్కీ కలిసి నటించలేదు కాబట్టి ఈ టాక్ షోకు వచ్చారు.
టేప్ కాస్ట్ ఎపిసోడ్ ముగిశాక ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అప్పుడప్పుడూ అవార్డు ఫంక్షన్లకు కలిసి హాజరవ్వడం మొదలుపెట్టారు. స్టేజీపైనే ఒకసారి కత్రినాను ఫ్లర్ట్ చేశాడు విక్కీ. కరోనా లాక్ డౌన్ సమయంలో విక్కీ తరచూ కత్రినా ఇంటికి వెళ్లి వచ్చేవాడు. ప్రేమను మొదట ఎవరు వ్యక్తపరిచారో తెలియదు కానీ, త్వరగానే పెళ్లి పట్టాలెక్కేసింది వారి లవ్ స్టోరీ. ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాకే ముహూర్తాలు పెట్టారు.
వీరి ప్రేమ విషయాన్ని మొదట బయటపెట్టింది మాత్రం అనిల్ కపూర్ కొడుకు హర్షవర్దన్. ఓ టీవీషోలో అతనికి ఓ ప్రశ్న ఎదురైంది... ఇండస్ట్రీలో రిలేషన్ షిప్‌లో ఉన్నారని మీరు నమ్ముతున్న పుకారు ఏది?అని. దానికి అతడు ‘విక్కీ-కత్రినా లవ్ లో ఉన్నారు, ఇది నిజం’ అంటూ చెప్పాడు. ఈ ఏడాది మొదట్లో ఇలా చెప్పడంతో అప్పట్నించి ఈ జంట గురించి పుకార్లు మరీ ఎక్కువయ్యాయి. ఇప్పుడు అవి పుకార్లు కాదని నిజమేనని తేలింది.
Also Read: నెల రాజుని... ఇల రాణిని... కలిపింది కదా 'సిరివెన్నెల'! ఆయన చివరి సంతకం విన్నారా?
Also Read: డెసిషన్ మారలేదు... పుకార్లకు మరోసారి చెక్ పెట్టిన 'భీమ్లా నాయక్' ప్రొడ్యూసర్
Also Read: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో డబుల్ హ్యాట్రిక్‌కు సన్నాహాలు?
Also Read: యంగ్ హీరోకి టైటిల్ కష్టాలు.. రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోన్న నిర్మాత..
Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి