Sirivennela: నెల రాజుని... ఇల రాణిని... కలిపింది కదా 'సిరివెన్నెల'! ఆయన చివరి సంతకం విన్నారా?
'శ్యామ్ సంగ రాయ్' సినిమాలో రెండు పాటలను దివంగత రచయిత 'సిరివెన్నెల' రాశారు. అందులో ఓ పాటను ఆయన రాశారు. నేడు దానిని విడుదల చేశారు.
'నెల రాజుని... ఇల రాణిని... కలిపింది కదా సిరివెన్నెల! దూరమా... దూరమా... తీరమై చేరుమా' - 'శ్యామ్ సింగ రాయ్'లో 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి రాసిన ఓ పాటలో కొన్ని పంక్తులు ఇవి. పాటలో ఆయన ఇంటి పేరుగా మారిన తొలి సినిమా పేరు వచ్చేలా రాశారు. 'సిరివెన్నెల చివరి సంతకం' పేరుతో నేడు ఈ పాటను చిత్రబృందం విడుదల చేసింది.
సిరివెన్నెల చివరి సంతకం! ✍️❤️
— Niharika Entertainment (@NiharikaEnt) December 7, 2021
The Last Song of the Legendary #SirivennelaSeetharamaSastry Garu 🙏 #Sirivennela Lyrical Song from #ShyamSinghaRoy is out now!!
▶️https://t.co/ecCzuPULfz@NameisNani @Sai_Pallavi92 @MickeyJMeyer @anuragkulkarni_ @Rahul_Sankrityn @NiharikaEnt
'తన నవ్వుల్లో తళుకు తళుకు... తన చెంపలలో చెమకు చెమకు... తమ మువ్వల్లో ఝనకు ఝనకు... సరికొత్త కళ' అంటూ ఈ పాటలో కథానాయికను కథానాయకుడు వర్ణించడమూ ఉంది. ఆ తర్వాత
'చాంగురే ఇంతటిదా నా సిరి...
అన్నది ఈ శారద రాతిరి...
మిలమిలా చెలి కన్నుల తన కళలను కనుగొని అచ్చెరువున మురిసి...
అయ్యహో ఎంతటిదీ సుందరి!
ఎవ్వరూ రారు కదా తన సరి...
సృష్టికే అద్దము చూపగా పుట్టినదేమో నారి సుకుమారి...
ఇది నింగికి నెలకు జరిగిన పరిచయమే' అంటూ 'సిరివెన్నెల' మార్క్ సాహిత్యమూ ఉంది. మిక్కీ జే. మేయర్ ఈ పాటకు చక్కటి బాణీ అందించగా... అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
Also Read: ఏదో ఏదో... పాటలోనూ మళ్లీ ముద్దును చూపించారు! మరి, మరో ముద్దును?
నాని, సాయి పల్లవిపై ఈ పాటను తెరకెక్కించారు. సాయి పల్లవి కాకుండా ఈ సినిమాలో కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను వెంకట్ బోయనపల్లి నిర్మించారు. డిసెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'Sirivennela' Lyrical song from Shyam Singha Roy:
Also Read: డెసిషన్ మారలేదు... పుకార్లకు మరోసారి చెక్ పెట్టిన 'భీమ్లా నాయక్' ప్రొడ్యూసర్
Also Read: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో డబుల్ హ్యాట్రిక్‌కు సన్నాహాలు?
Also Read: యంగ్ హీరోకి టైటిల్ కష్టాలు.. రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోన్న నిర్మాత..
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి