అన్వేషించండి
Advertisement
(Source: Poll of Polls)
Bheemla Nayak: డెసిషన్ మారలేదు... పుకార్లకు మరోసారి చెక్ పెట్టిన 'భీమ్లా నాయక్' ప్రొడ్యూసర్
'భీమ్లా నాయక్' సినిమాపై ఎన్నో పుకార్లు వినిపిస్తున్నాయి. అందులో ఓ విషయమై పదే పదే ఒకటే పుకారు వస్తోంది. దాన్ని మరోసారి నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఖండించారు.
సంక్రాంతి బరిలో 'భీమ్లా నాయక్' విడుదల అవుతుందా? లేదా? ఇప్పుడీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలామంది చూస్తున్నారు. ప్రేక్షకులకు మాత్రమే కాదు, పరిశ్రమలోని ప్రముఖులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదల తేదీ విషయంలో 'భీమ్లా నాయక్' బృందం మొదటి నుంచి ఒకటే మాట మీద ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చెబుతోంది. అయితే... వాయిదా పడొచ్చనే మాటలు వినిపిస్తున్నాయి.
సంక్రాంతికి వారం రోజుల ముందు జనవరి 7న 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' విడుదల కానుంది. జనవరి 14న 'రాధే శ్యామ్' విడుదలకు రెడీగా ఉంది. రెండూ పాన్ ఇండియా సినిమాలే. తెలుగు మార్కెట్ వరకూ వస్తే... ఆ రెండిటిలో నటించిన హీరోలకు మంచి మార్కెట్ ఉంది. పవన్ కల్యాణ్‌కూ మార్కెట్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్ల సంఖ్య పదిహేను వందలకు అటూ ఇటూ! మూడు భారీ సినిమాలు వస్తే... మూడు సినిమాల వసూళ్లకూ గండి పడుతుందనేది ఎవరూ కాదనలేని సత్యం. అందుకని, 'భీమ్లా నాయక్' సినిమాను వాయిదా వేయించాలని ప్రయత్నాలు జరిగాయనేది ఇండస్ట్రీ గుసగుస. అందులో ఎంత నిజం ఉందనేది పక్కన పెడితే... అప్పుడప్పుడూ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా మరోసారి వచ్చాయి. 'భీమ్లా నాయక్' వాయిదా పడిందని మంగళవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ జరుగుతోంది. వీటికి నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెక్ పెట్టారు.
Also Read: పాట కష్టం తెలిసినోడు... కొన్నేళ్లుగా రాయనోడు... మళ్లీ పవన్ కోసం రాశాడు!
Also Read: పాట కష్టం తెలిసినోడు... కొన్నేళ్లుగా రాయనోడు... మళ్లీ పవన్ కోసం రాశాడు!
"జస్ట్... ఇప్పుడే 'లా లా భీమ్లా' (సాంగ్) వీడియో రష్ చూశాను. గుర్తు పెట్టుకోండి... జనవరి 12, 2022న థియేటర్లలో బ్లాస్ట్ ఖాయం" అని నాగవంశీ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో... త్రివిక్రమ్ అందించిన స్క్రీన్ ప్లే, సంభాషణలతో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా 'భీమ్లా నాయక్'. ఇందులో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లు. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో డబుల్ హ్యాట్రిక్‌కు సన్నాహాలు?
Also Read: యంగ్ హీరోకి టైటిల్ కష్టాలు.. రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోన్న నిర్మాత..
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Just saw the Video Rush of #LaLaBheemla 🥁
— Naga Vamsi (@vamsi84) December 7, 2021
Mark it guys, You're in for a BLAST on 12th JAN 2022 in THEATRES 💥🔥#BHEEMLANAYAKon12thJAN pic.twitter.com/OvBkrdULG6
Also Read: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో డబుల్ హ్యాట్రిక్‌కు సన్నాహాలు?
Also Read: యంగ్ హీరోకి టైటిల్ కష్టాలు.. రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోన్న నిర్మాత..
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement