RRR Trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌లో రాజమౌళి చూపించబోయేది ఇదే... మళ్లీ సేమ్ స్ట్రాటజీ!
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' ట్రైలర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో రాజమౌళి ఏం చూపిస్తున్నారు? ఏంటి?
దాగుడు మూతలు లేవ్! దాపరికాలు లేవ్! వారేంటీ? వీరేంటి? అని సస్పెన్స్‌లో పెట్టడం అసలే లేదు! ఖుల్లమ్ ఖుల్లా... అంతా ఓపెన్ చేసేయడమే! మూడు గంటల సినిమాను మూడు నిమిషాల్లో సూటిగా చెప్పేయాలని దర్శక ధీరుడు రాజమౌళి డిసైడ్ అయ్యారు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' ట్రైలర్‌లో అసలు కథేంటి? అనేది చూపించబోతున్నారు. మరికొన్ని గంటల్లో... గురువారం ఉదయం విడుదల కానున్న ట్రైలర్‌లో రాజమౌళి కథను రివీల్ చేయబోతున్నారని టాక్. ప్రేక్షకుల అంచనాలు మించి ట్రైలర్ ఉంటుందని తెలిసింది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమా కథ చెప్పేస్తే... ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? కొందరిలో ఈ సందేహం రావచ్చు. కథేంటో చెప్పి మరీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం రాజమౌళి స్టయిల్. 'బాహుబలి 2' విడుదలకు ముందు వరకూ 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనే ప్రశ్నకు సమాధానం ఆయన దాచిపెట్టారు కానీ... అంతకు ముందుకు వెళితే, సినిమా విడుదలకు ముందే కథేంటో చెప్పేసేవారు. 'మర్యాద రామన్న', 'ఈగ' సినిమాలకు అదే విధంగా చేశారు. స్టోరీ రివీల్ చేసి, 'ఈ స్టోరీని రాజమౌళి ఎలా తీసి ఉంటాడు?' అని ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం ఆయన స్టయిల్. ఈసారీ సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు.
Also Read: రాజమౌళి మూడు గంటల సినిమా తీశారా? 'ఆర్ఆర్ఆర్' రన్ టైమ్ ఎంత?
'ఆర్ఆర్ఆర్'లో కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే... ఇది కొమరం భీమ్, అల్లూరి కథ కాదు. వాళ్లిద్దరి పాత్రలను ఆధారం చేసుకుని, ఫిక్షనల్ స్టోరీతో 'ఆర్ఆర్ఆర్' తెరకెక్కిస్తున్నామని రాజమౌళి ముందే చెప్పారు. ఇప్పుడు ట్రైలర్‌లో ఆ ఫిక్షనల్ స్టోరీ చెప్పబోతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రల మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? బ్రిటీషర్లపై ఎలా పోరాడారు? అజయ్ దేవగణ్ పాత్ర ఏమిటి? వంటి అంశాలపై ట్రైలర్‌లో క్లారిటీ ఇవ్వనున్నారని తెలిసింది.
Also Read: 'జనని...' పాటకు జీవం పోసిన పాత్రలు ఇవే!
ఆలియా భట్, ఒలీవియా మోరిస్, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా... డీవీవీ దానయ్య నిర్మించారు. జనవరి 7న సినిమా విడుదల కానుంది.
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
Also Read: నెల రాజుని... ఇల రాణిని... కలిపింది కదా 'సిరివెన్నెల'! ఆయన చివరి సంతకం విన్నారా?
Also Read: డెసిషన్ మారలేదు... పుకార్లకు మరోసారి చెక్ పెట్టిన 'భీమ్లా నాయక్' ప్రొడ్యూసర్
Also Read: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో డబుల్ హ్యాట్రిక్‌కు సన్నాహాలు?
Also Read: యంగ్ హీరోకి టైటిల్ కష్టాలు.. రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోన్న నిర్మాత..
Also Read: ఒక్కసినిమా కూడా కలిసి చేయలేదు, కేవలం ఆ ఒక్క మాటతో ప్రేమలో పడ్డారు... విక్కీ-కత్రినా లవ్ స్టోరీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి