Rana: క్లైమాక్స్ లేకుండా సినిమా రిలీజ్.. '1945' ఇలా ఉందేంటి..?
ఉన్నట్లుండి '1945' సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి జనవరి 7న విడుదల చేశారు.
రానా నటించిన '1945' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో ఆరేళ్లక్రితం మొదలైంది. 'బాహుబలి' తరువాత రానా సోలో హీరోగా ఒప్పుకున్న సినిమాల్లో '1945' ఒకటి. తమిళ దర్శకుడు సత్య శివ దీన్ని రూపొందించాడు. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాను తెరకెక్కించారు. కానీ ఈ సినిమా ఊసే లేకుండా పోయింది.
ఆ తరువాత సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా.. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదని.. క్యాష్ చేసుకోవడానికే సినిమా ఫస్ట్ లుక్ ని వదిలారని.. ఈ ప్రాజెక్ట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని సోషల్ మీడియా వేదికగా చెప్పారు రానా. ఈ విషయంలో రానాకి చిత్ర నిర్మాత కౌంటర్ కూడా ఇచ్చారు. దీంతో దర్శకనిర్మాతలకు రానాకి మధ్య ఏదో గొడవ జరిగిందని భావించారు నెటిజన్లు.
అయితే ఉన్నట్లుండి ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి జనవరి 7న విడుదల చేశారు. ఇందులో రెజీనా హీరోయిన్ గా నటించగా.. నాజర్, సత్యరాజ్ లాంటి పేరున్న ఆర్టిస్ట్ లు నటించారు. దీంతో సినిమా బావుంటుందేమో అని థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురైంది. అసలు పూర్తి కాకుండానే ఈ సినిమాను రిలీజ్ చేసి ప్రేక్షకులకు షాకిచ్చారు మేకర్స్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సరిగ్గా చేయలేదు.
సీన్ కి సీన్ కి మధ్య కనెక్షన్ లేదు. పైగా రానా పాత్రకి ఇంకెవరితోనో డబ్బింగ్ చెప్పించారు. మరో షాక్ ఏంటంటే.. భారీ క్లైమాక్స్ సీన్ ఉంటుందని ఊహించుకుంటే కేవలం వాయిస్ ఓవర్ తో పూర్తి చేసేశారు. రానా అందుబాటులో లేకపోవడంతో అసలు క్లైమాక్స్ షూట్ చేయలేదని తెలుస్తోంది. కానీ క్లైమాక్స్ కూడా లేకుండా సినిమాను రిలీజ్ చేయడమనేది చాలా సిల్లీగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. అందుకేనేమో.. రానా ఈ సినిమాను ప్రమోట్ కూడా చేయకుండా దూరంగా ఉన్నాడు.
Also Read: రూ.180 కోట్ల భారం.. తన నెత్తిన వేసుకున్న జక్కన్న..
Also Read:'బంగార్రాజు' కష్టాలు.. చెప్పిన టైంకి వస్తాడా..?
Also Read: షూటింగ్ క్యాన్సిల్.. ఇంట్లోనే చిల్ అవుతోన్న రౌడీ హీరో..
Also Read: క్లాసులు షురూ.. ధనుష్ 'సార్' ఆన్ డ్యూటీ..
Also Read: కోవిడ్ పాజిటివ్ వైఫ్.. నితిన్ బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేశాడో చూశారా..?
Also Read: 'హృదయమా' ఫస్ట్ సింగిల్.. రిలీజ్ చేసిన మహేష్ బాబు..