By: ABP Desam | Updated at : 12 Sep 2023 04:05 PM (IST)
'నా సామి రంగ' సినిమాలో నాగార్జున
కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా సినిమా 'నా సామి రంగ' (Naa Saami Ranga Movie). ఈ చిత్రంతో నృత్య దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టలేదు. అయితే... హీరో అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా సినిమాను అనౌన్స్ చేశారు. వీడియో టీజర్ కూడా విడుదల చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
సాంగ్స్ రికార్డింగ్ మొదలు పెట్టిన కీరవాణి!
Na Sami Ranga Movie : 'నా సామి రంగ' చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమాను ప్రకటించినప్పుడు ఆయన పేరు కూడా వెల్లడించారు. చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు ఆయన సాంగ్స్ రికార్డింగ్ మొదలు పెట్టారు.
'నా సామి రంగ' కోసం సంగీత దర్శకుడు కీరవాణి పని ప్రారంభించారని, ఆల్రెడీ రెండు మూడు ట్యూన్స్ కూడా ఫైనలైజ్ చేశారని, ప్రస్తుతం వాటి రికార్డింగ్ జరుగుతోందని తెలిసింది. నాగార్జున, కీరవాణిలది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళ కలయికలో చాలా సినిమాలు వచ్చాయి. అందులో కమర్షియల్ హిట్స్ ఉన్నాయి. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'ఓం నమో వెంకటేశాయ' వంటి డివోషనల్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. అయితే... 'నా సామి రంగ' వాటన్నిటి కంటే భిన్నంగా ఉంటుందని టాక్.
Also Read : విశాల్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు - 'మార్క్ ఆంటోని' విడుదలకు లైన్ క్లియర్!
నాగార్జున మాస్ సినిమాలు కొన్ని చేశారు. అయితే 'నా సామి రంగ' వంటి మాస్ సినిమా ఇప్పటి వరకు చేయలేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు చిత్రసీమలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై నివాస చిట్టూరి భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మించనున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
మలయాళంలో ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'పోరింజు మరియం జోస్' సినిమా స్ఫూర్తితో 'నా సామి రంగ' తెరకెక్కుతోందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే... ఆ విషయాన్ని దర్శక, నిర్మాతలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు.
సంక్రాంతి బరిలో 'నా సామి రంగ'
'నా సామి రంగ' చిత్రాన్ని ప్రకటించినప్పుడు... వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. సంక్రాంతి బరిలో నాగార్జునకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. పైగా, ఇది మాస్ సినిమా. అందుకని, సంక్రాంతి సీజన్ మిస్ చేసుకోవాలని అనుకోవడం లేదట!
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'స్పిరిట్' షూటింగ్ స్టార్ట్ చేసేది ఎప్పుడో చెప్పిన ప్రొడ్యూసర్!
'నా సామి రంగ' టైటిల్ వినగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా నటించిన కల్ట్ హిట్ 'సిపాయి చిన్నయ్య' సినిమాలో 'నా సామి రంగ' ఐకానిక్ సాంగ్! ఆ విధంగా ఈ సినిమాకు ఏయన్నార్ టచ్ కూడా ఉంది. 'అల్లరి' నరేష్ ఈ సినిమాలో కీలక పాత్ర చేయనున్నట్లు టాక్. ఇతర నటీనటులు, హీరోయిన్ల వివరాలను త్వరలో అనౌన్స్ చేయనున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!
అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!
‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు
బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత
Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా
KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
/body>