Pushpa Movie : 'పుష్ప' టీమ్ ప్లాన్ ఇదే.. అనుకున్నదానికంటే ముందుగానే..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల వాళ్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' లాంటి భారీ సినిమాలు వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో ఈ ఏడాదికి ఇక ఆశలన్నీ 'పుష్ప' మీదే ఉన్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ ను 'పుష్ప ది రైజ్' పేరుతో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
Also Read : Allu Arjun: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్డుపక్కన హోటల్‌లో టిఫిన్ తిన్న బన్నీ.. కాకినాడలో బిజీబిజీ
క్రిస్మస్ రిలీజ్ అంటే డిసెంబర్ 25న సినిమా విడుదలవుతుందని అందరూ భావిస్తున్నారు. కానీ 'పుష్ప' టీమ్ ఆలోచన మరో రకంగా ఉందని సమాచారం. క్రిస్మస్ సమయానికి సినిమా థియేటర్లో ఉండడం ఖాయం. కానీ అంతకంటే ముందే సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్ పండగకు వారం ముందు అంటే డిసెంబర్ 17న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ తేదీని ఫిక్స్ చేయడానికి మరో కారణం కూడా ఉంది.
డిసెంబర్ 25న హిందీ సినిమా 'లాల్ సింగ్ చద్దా' కూడా విడుదల కాబోతుంది. దాంతో పోటీగా 'పుష్ప'ను రిలీజ్ చేస్తే ఉత్తరాదిన ఆశించిన వసూళ్లు రాకపోవచ్చు. నిజానికి బాలీవుడ్ లో కూడా 'పుష్ప'పై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఆమిర్ ఖాన్ తో పోటీ పడితే కష్టమే. అందుకే వారం ముందే ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. దీని వలన సోలో రిలీజ్ దక్కడంతో పాటు కలెక్షన్స్ కూడా దండుకోవచ్చు. సినిమాకి మంచి టాక్ వస్తే లాంగ్ రన్ కలెక్షన్స్ మోతమోగించడం ఖాయం. క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ హాలిడే కూడా సినిమాకి కలిసొస్తుంది. మొత్తానికి 'పుష్ప' టీమ్ మాములుగా ప్లాన్ చేయలేదు!
Also Read: ఖరీదైన కారు కొన్న చెర్రీ.. స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న మెగా పవర్ స్టార్, ధర ఎంతంటే..
Also Read: సాయిధరమ్ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ పూర్తి.. హెల్త్ బులెటిన్ విడుదల
Also Read: మత్తులో మాణిక్యాలు.. ఎఫ్-క్లబ్ చుట్టూ తిరుగుతున్న డ్రగ్స్ కథ, ఆ పార్టీయే కొంప ముంచిందా?
Also Read : Tollywood Drug Case: నవదీప్‌ను విచారిస్తున్న ఈడీ.. ఎఫ్-క్లబ్ కేంద్రంగా డ్రగ్స్ లావాదేవీలు?