Actress Bhavana: ఆమె ఆవేదన అక్షర రూపంలో... అయిదేళ్ల మౌనం తరువాత తొలిసారి స్పందించిన భావన
భావన మీనన్... తనపై జరిగిన అఘాయిత్యంపై తొలిసారి స్పందించింది.
భావన మీనన్ మలయాళ నటి అయినా అనేక తెలుగు సినిమాల్లోనూ నటించింది. మహాత్మ సినిమాలో శ్రీకాంత్ పక్కన నటించి మంచి పేరు తెచ్చుకుంది. సరిగ్గా అయిదేళ్ల క్రితం ఆమెను కిడ్నాప్ చేసి కారులోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొంతమంది దుర్మార్గులు. ఆ ఘటన జరిగిన తరువాత భావన మౌనం వహించింది. ఆ ఘటన గురించి ఎక్కడా మాట్లాడలేదు. ప్రియుడిని పెళ్లి చేసుకుంది. అయిదేళ్ల తరువాత ఇప్పుడు సోషల్ మీడియాలో తొలిసారి తనపై జరిగిన అఘాయిత్యంపై స్పందించింది. ఆమె తన బాధకు, ఆవేదనకు అక్షర రూపం ఇచ్చింది.
ఆవేదన అక్షర రూపంలో....
‘ఇది అంత సులువైన ప్రయాణం కాదు. బాధితురాలి నుంచి బతికి బట్టకట్టిన మనిషిగా చేసిన ప్రయాణం. అయిదేళ్లుగా నాపై జరిగిన దాడికి సంబంధించిన బాధ, బరువు నా పేరును, నా గుర్తింపును అణిచివేసేలా చేశాయి. నేరం చేసింది నేను కానప్పటికీ నన్న అవమానించడానికి, నోరువిప్పకుండా చేయడానికి, ఒంటరిని చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. అలాంటి సమయంలో నాకు అండగా కొంతమంది ముందుకు వచ్చారు. అప్పుడే నాకర్ధమైంది న్యాయం కోసం జరిగే పోరాటంలో నేను ఒంటరిని కానని. న్యాయం గెలవడం కోసం, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేయడం కోసం, మరెవరికీ ఇలాంటి కష్టాలు రాకుండా ఉండడం కోసం నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలబడిన వారందరికీ ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది భావనా.
2017లో కొచ్చిలో షూటింగ్ నుంచి తిరిగొస్తుండగా భావనపై దాడి జరిగింది. ఆమె కారును దారి మళ్లించి, మరో వ్యాన్ లోకి మార్చి కొంతమంది లైంగికంగా వేధించారు. దీనికి మలయాళ నటుడు, నిర్మాత దిలీప్ కుమార్ కారణమని ఆరోపణలు ఉన్నాయి. అతనితో పాటూ మరో అయిదుగురు కిరాయి గూండాలపై కేసు నమోదైంది.
View this post on Instagram
Also Read: నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్‌స్పెక్టర్.. అన్నీ చేశాకే ఇక్కడొచ్చి కూర్చున్నాం.. అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో వచ్చేసింది!
Also Read: 'జబర్దస్త్' నుంచి అభి అవుట్... 'హైపర్' ఆది కామెంట్!
Also Read: జనవరి 11 ఎపిసోడ్: ప్రేమని అక్షరాలుగా మలిచిన రిషి, చాలా బాగా రాశారన్న వసు... గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్..
Also Read: సినిమాలోనూ తండ్రీ కూతుళ్లుగా... అందరూ వద్దన్నా సరే!
Also Read: జనవరి 11 ఎపిసోడ్: తాడికొండలో సౌందర్య ఎంట్రీ, నీడలా వెంటాడిన మోనిత.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
Also Read: సుకుమార్ బర్త్‌డేను వైఫ్ ఎలా సెలబ్రేట్ చేసిందో చూశారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి