Hyper Aadi: 'జబర్దస్త్' నుంచి అభి అవుట్... 'హైపర్' ఆది కామెంట్!

'జబర్దస్త్' నుంచి 'అదిరే' అభి వెళ్లిపోయారు. అభి వెళ్లిపోవడంపై 'హైపర్' ఆది ఏమని అన్నారంటే...

FOLLOW US: 

'జబర్దస్త్' షో నుంచి 'అదిరే' అభి టీమ్ వెళ్లిపోయింది. ఆయనతో పాటు మరో టీమ్ లీడర్ 'జిగేల్' జీవన్ కూడా 'జబర్దస్త్'ను వదిలేశాడు. ఈటీవీ నుంచి వెళ్లిన ఇద్దరూ... ఇప్పుడు 'స్టార్ మా' ఛాన‌ల్‌లో టెలికాస్ట్ అవుతున్న 'కామెడీ స్టార్స్' షో చేస్తున్నారు. అయితే... 'అదిరే' అభి ద్వారా 'జబర్దస్త్'కు వచ్చిన 'హైపర్' ఆది, ఇంకా అదే షోలో కంటిన్యూ అవుతున్నారు. యూట్యూబ్‌లో టాప్ వ్యూస్‌ వ‌స్తున్న స్కిట్స్‌లో అతడి స్కిట్స్ తప్పకుండా ఉంటున్నాయి. లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో అభి గురించి 'హైపర్' ఆది స్పందించారు.

"మీ గురువు గారు అభి జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు కదా! మీ అభిప్రాయం ఏంటి?" అనే ప్రశ్న 'హైపర్' ఆదికి ఎదురైంది. అందుకు బదులుగా ఆయన "అభి అన్న నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి అభి కారణం. ఒక్కొక్కరూ ఒక్కో స్టాండ్ తీసుకుంటారు. ఆయనకు ఉన్న ఇది ఏమిటో నాకు తెలియదు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను తప్ప కామెంట్ ఏమీ చేయను" అని చెప్పారు.

'హైపర్' ఆది కూడా జబర్దస్త్ వదిలేసి వేరే ఛాన‌ల్‌కు వెళ్లాల‌ని అనుకుంటున్న‌ట్టు గతంలో వార్తలు వచ్చాయి. వాటిపై కూడా ఆయన స్పందించారు. "నేను వేరే ఛాన‌ల్‌కు షిఫ్ట్ అవుదామని అనుకోలేదు. రెండు ఛానళ్లలో చేద్దామని అనుకున్నాను. అలా కుదరదని అన్నారు. అందుకని, ఒక దాంట్లో ఆగిపోయా" అని 'హైపర్' ఆది వివరించారు. ఈటీవీ 'జబర్దస్త్'లో చేస్తున్న అభి, స్టార్ మా రియాలిటీ షో 'బిగ్ బాస్' ప్రతి సీజన్‌లోనూ ఒకసారి అయినా కనిపించి సందడి చేస్తుంటారు.

View this post on Instagram
 
A post shared by Adhire Abhi (@adhire_abhi)

Also Read: సినిమాలోనూ తండ్రీ కూతుళ్లుగా... అందరూ వద్దన్నా సరే!
Also Read: సహజీవనం చేస్తున్న ఆ హీరోహీరోయిన్లు? వారిద్దరి మధ్య వయసు తేడా ఎంతంటే...
Also Read: సుకుమార్ బ‌ర్త్‌డేను వైఫ్ ఎలా సెల‌బ్రేట్ చేసిందో చూశారా?
Also Read: ప్రభాస్ ని టెన్షన్ పెడుతోన్న 'బ్రహ్మాస్త్ర'.. అసలు కథేంటంటే..?
Also Read: సినిమా ఇండస్ట్రీను అవమానించారు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నిర్మాతల మండలి సీరియస్..
Also Read: క్రేజీ డైరెక్టర్ మూవీతో హీరోగా ఫేస్ టర్నింగ్ ఇస్తున్న సింగర్ సిద్ శ్రీరామ్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Jan 2022 08:04 AM (IST) Tags: Jabardasth Hyper Aadi Comedy Stars Telugu TV News Adhire Abhi TV News

సంబంధిత కథనాలు

The warriorr Trailer: రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్

The warriorr Trailer: రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్

Anushka: ప్రభాస్ సినిమాలో అనుష్క - నిజమేనా?

Anushka: ప్రభాస్ సినిమాలో అనుష్క - నిజమేనా?

Bimbisara: 'ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు' - 'బింబిసార' ట్రైలర్ గ్లింప్స్

Bimbisara: 'ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు' - 'బింబిసార' ట్రైలర్ గ్లింప్స్

Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్

Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్

Jabardasth: బిగ్ బాస్ బ్యూటీకి 'జబర్దస్త్' ఛాన్స్ - అనసూయ రేంజ్ లో క్లిక్ అవుతుందా?

Jabardasth: బిగ్ బాస్ బ్యూటీకి 'జబర్దస్త్' ఛాన్స్ - అనసూయ రేంజ్ లో క్లిక్ అవుతుందా?

టాప్ స్టోరీస్

Chandrababu : జగన్‌ను చూసి చాలా నేర్చుకున్నాను - చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు !

Chandrababu :  జగన్‌ను చూసి చాలా నేర్చుకున్నాను -   చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు !

YSRCP Plenary Vijayamma : వైఎస్ఆర్‌సీపీలో కొత్త టెన్షన్ - ప్లీనరీకి గౌరవాధ్యక్షురాలు హాజరవుతారా ?

YSRCP Plenary Vijayamma :  వైఎస్ఆర్‌సీపీలో కొత్త టెన్షన్ - ప్లీనరీకి గౌరవాధ్యక్షురాలు  హాజరవుతారా ?

Samsung Cheapest Foldable Mobiles: బడ్జెట్ ఫోల్డబుల్ ఫోన్లు తీసుకురానున్న శాంసంగ్ - ప్రస్తుతం ఉన్న వాటికంటే సగం ధరకే!

Samsung Cheapest Foldable Mobiles: బడ్జెట్ ఫోల్డబుల్ ఫోన్లు తీసుకురానున్న శాంసంగ్ - ప్రస్తుతం ఉన్న వాటికంటే సగం ధరకే!

Udaipur Murder Case : ముంబయి ఉగ్రదాడిని గుర్తుచేసేలా 26/11 బైక్ నెంబర్, అదనంగా రూ.5 వేలు చెల్లించిన ఉదయ్ పూర్ కిల్లర్

Udaipur Murder Case : ముంబయి ఉగ్రదాడిని గుర్తుచేసేలా 26/11 బైక్ నెంబర్, అదనంగా రూ.5 వేలు చెల్లించిన ఉదయ్ పూర్ కిల్లర్