By: ABP Desam | Updated at : 10 Jan 2022 07:07 PM (IST)
Edited By: harithac
ఈశ్వరన్ మూవీలో శింబు, నిధి
సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిధి అగర్వాల్. తమిళనాట కూడా అడుగుపెట్టిన ఈ అందాల తార శింబు హీరోగా తెరకెక్కిన ‘ఈశ్వరన్’సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఈ ఇద్దరి జంట చూడముచ్చటగాఉంది. సినిమా కూడా భారీ హిట్ కొట్టింది. వీరి జంట తమిళనాడు సినీ అభిమానులకు తెగ నచ్చేసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్టు సమాచారం. అప్పటి నుంచి ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరూ కలిపి బయట షికార్లు కూడా తిరిగారు. కాగా ఇప్పుడు వీరిద్దరూ సీరియస్ రిలేషన్ షిప్ లో అడుగుపెట్టారట. పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారట. అందుకే నిధి, శింబు కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేయడం మొదలుపెట్టారని టాక్. ఇలాగే సహజీవనం చాలా పుకార్లు షికార్లు చేయడం వారికి నచ్చడం లేదని, త్వరలోనే పెళ్లి చేసుకుని ఆ పుకార్లకు చెక్ పెట్టాలని ఇద్దరూ భావిస్తున్నారట. పెద్దల సమక్షంలో పెళ్లికి రెడీ అవుతున్నారట.
వయసు తేడా పదేళ్లు...
నిధి అగర్వాల్ కన్నా శింబు పదేళ్లు పెద్దవాడు. శింబు వయసు 38 ఏళ్లు కాగా, నిధి వయసు 28 ఏళ్లు. ఈ వయసు తేడాను ఇప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ ఏడాదే వీరి పెళ్లి వార్త వినే అవకాశం ఉంది. ప్రస్తుతం నిధి తెలుగు సినిమా ‘హీరో’విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఇక శింబు ‘మానాడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
గతంలో ప్రేమాయణాలు
శింబు గతంలో ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపి బ్రేకప్ చెప్పాడు. నయనతారతో దాదాపు పెళ్లి పీటల దాకా వెళ్లింది వ్యవహారం, కానీ కుదరలేదు. ఇక హన్సికతో ప్రేమ వ్యవహారం త్వరగానే ముగిసింది. అలాగే నిధి కూడా గతంలో క్రికెట్ కేఎల్ రాహుల్ తో ప్రేమలోపడింది. కానీ త్వరగానే విడిపోయారు. శింబు-నిధి ప్రేమ పెళ్లి వరకు చేరుతుందో లేదో చూడాలి.
Also Read: వంటలయ్యగా మారిన డాక్టర్ బాబు, ప్రకృతి ఆశ్రమానికి సౌందర్య, ఆనందరావు.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
Also Read: కళ్లలో దాగి ఉన్న కలలు అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం.. నెక్ట్స్ లెవెల్ కి చేరిన గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్...
Also Read: 'నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా..' శాంతనుతో ఎఫైర్ పై శృతి కామెంట్స్..
Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకీ, వరుణ్ చిందులు - ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’ సాంగ్ రిలీజ్
O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!
Karate Kalyani : కలెక్టర్ ఎదుట హాజరైన కరాటే కల్యాణి - పాప దత్తతపై యూటర్న్ !
LICIPO Memes : ఎల్ఐసీ షేర్లపై అతిగా ఆశలు పెట్టుకున్న వారికి షాక్ - ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి
MI vs SRH: లక్కు హిట్మ్యాన్ వైపే! టాస్ ఓడిన కేన్ మామ!
Gyanvapi Mosque Case: 'జ్ఞానవాపి మసీదు' కేసులో సుప్రీం కీలక ఆదేశాలు- కమిషనర్ తొలగింపు