Unstoppable with NBK: నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్‌స్పెక్టర్.. అన్నీ చేశాకే ఇక్కడొచ్చి కూర్చున్నాం.. అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో వచ్చేసింది!
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే కొత్త ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.
ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం కోసం నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో సంక్రాంతి ఎపిసోడ్‌కు లైగర్ టీం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, చార్మి గెస్ట్‌లుగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది.
సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ ట్రెడిషనల్‌గా పంచెకట్టుతో వచ్చారు. విజయ్ దేవరకొండ రాగానే పంచె పైకి కట్టి సరదాగా బాక్సింగ్ కూడా చేశారు. ‘సమరసింహారెడ్డి వెల్‌కమ్స్ అర్జున్ రెడ్డి’ అని వినూత్నంగా విజయ్‌కి వెల్‌కం చెప్పారు. ‘నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్‌స్పెక్టర్’ అంటూ జోష్ నింపారు. ‘నువ్వు రౌడీ అని ఫిక్స్ అయిపోయావా’ అని బాలయ్య అడిగినప్పుడు.. ‘ఫస్ట్ నుంచి అది చేయద్దు, ఇది చేయద్దు లాంటి మాటలు విని విసిగిపోయా... లేదు ఇది కచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యా’ అని విజయ్ ఆన్సర్ ఇచ్చాడు.
ఆ తర్వాత వచ్చిన అతిథులకు సరదాగా కొబ్బరికాయలు కొట్టి ఇస్తూ.. ‘ఈ బిజినెస్ బాగుందే.. సైడ్ బిజినెస్’ అంటూ నవ్వులు పూయించారు. ‘బ్యాంకాక్‌లో కొబ్బరిబోండాల్లో వోడ్కా కలిపి ఇస్తారు’ అని చార్మి అనప్పుడు... ‘అవన్నీ చేశాకే ఇక్కడికొచ్చి కూర్చున్నాం’ అని బాలయ్య సమాధానం ఇచ్చారు.
‘నేనెప్పటికీ మర్చిపోలేని పాత్ర తేడా సింగ్’ అంటూ 'పైసా వసూల్'లో తన పాత్రను గుర్తు చేసుకున్నారు. ‘నేనెంత ఎధవనో నాకే తెలీదని నేనంటా... ఇంకెవరైనా అంటే కొడతా’ అని పూరికే పంచ్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ జనవరి 14వ తేదీన ఆహా యాప్‌లో ప్రసారం కానుంది.
Samarasimha Reddy hosts Arjun Reddy on the sets of #UnstoppableWithNBK this Sankranthi!
— ahavideoIN (@ahavideoIN) January 10, 2022
Episode 9 Promo Out Now.
- https://t.co/NYnfMBjdAb
Premieres January 14. #NandamuriBalakrishna @TheDeverakonda @purijagan @Charmmeofficial pic.twitter.com/M5NiTqU61F
Also Read: వంటలయ్యగా మారిన డాక్టర్ బాబు, ప్రకృతి ఆశ్రమానికి సౌందర్య, ఆనందరావు.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
Also Read: కళ్లలో దాగి ఉన్న కలలు అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం.. నెక్ట్స్ లెవెల్ కి చేరిన గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్...
Also Read: 'నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా..' శాంతనుతో ఎఫైర్ పై శృతి కామెంట్స్..