News
News
X

Crime News : పేరు విలియమ్స్ .. చేయాల్సింది పియానో వాయించడం.. చేసింది అమ్మాయిలకు టోకరా ! ఈ మోసగాడి కథ మామూలుగా లేదు.. !

నల్లగొండలో 19 మంది మహిళల్ని మోసం చేసిన వ్యక్తిని అతి భార్య పోలీసులకు పట్టించింది. గుండె నొప్పి పేరుతో ఆ మోసగాడు ఆస్పత్రిలో చేరాడు.

FOLLOW US: 

నల్లగొండలో ఓ మహిళ తన భర్త తనను మోసం చేస్తున్నాడని.. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఆ మహిళ తన భర్త తనను మాత్రమే కాదని ఇతర యువతుల్ని కూడా మోసం చేస్తున్నాడని.. వాళ్లను.. తన భర్త నుంచి కాపాడాలని కోరింది. ఈ కేసు కాస్త విచిత్రంగా ఉండటంతో పోలీసులు నెమ్మదిగా కూపీ లాగారు. ఎంత లాగినా ఆ మోసాల చిట్టా వస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ఆ భర్త .. ఆ భార్యను కాకుండా 19 మంది యువతుల్ని పెళ్లి పేరుతో మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంకా ఎవరైనా వస్తే ఈ జాబితా పెరుగుతుంది. ఇంత మందిని అతను ఎలా మోసం చేశాడా అని పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. 

Also Read : సుబ్బరామిరెడ్డి కంపెనీకి భారీ టోకరా.. నిందితులు అరెస్టు, అసలేం జరిగిందంటే..

19 మంది యువతుల్ని పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యక్తి పేరు విలియమ్సన్. న్యూజిలాండో.. ఆస్ట్రేలియాకో చెందిన వ్యక్తి కాదు.. అచ్చంగా నల్లగొండ వ్యక్తే. కాకపోతే చర్చిలో పని చేస్తాడు. అందుకే ఆ పేరు పెట్టుకున్నాడు. చర్చిలో చేసే పని పియానో వాయించడం. చర్చికి ప్రార్థనల కోసం జనం వచ్చినప్పుడు.. వాళ్లంతా ప్రార్థనలు చేస్తున్న సమయంలో పియానో వాయిస్తూ ఉంటాడు. అతను పియానో వాయించడం చాలా మందికి నచ్చి వచ్చి మాటలు కలిపేవారు. అదే చాన్స్ అనుకున్నాడు విలియమ్సన్.  తమ మాయ మాటలను నమ్మిన వారందర్నీ వంచించడం ప్రారంభించాడు. 

Also Read : అర్ధనగ్న స్థితిలో మహిళా డాన్సర్ మృతి.. పక్కనే బీరు బాటిల్

పెళ్లి కాలేదని చెప్పి చర్చికి వచ్చే అమ్మాయిల్లో తన బుట్టలో పడిన వారందర్నీ మోసం చేయడం ప్రారంభించాడు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే  ఆ పందొమ్మిది మంది యువతులకు డౌట్ రాలేదేమో కానీ.. విలియమ్సన్ భార్యకు మాత్రం డౌట్ వచ్చింది. కొన్ని వివరాలు కనుక్కుంది. చాలా మంది యువతులు మోసపోతున్నారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విలియమ్సన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

Also Read: RGIA Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత... బట్టల్లో చుట్టి తరలిస్తున్న ప్రయాణికుడు

తన భార్య ఫిర్యాదు చేసిన తన గుట్టు అంతా బయట పెట్టించేసిందని తెలియడంతో విలియమ్సన్ ఆందోళనకు గురయ్యాడు. తనకు గుండెపోటు వచ్చిందో లేక వచ్చినట్లు అనిపించిందో.. లేకపోతే.. నిజం తెలిసి ఆ పందొమ్మిది మంది అమ్మాయిలు వచ్చి కొట్టే కొట్టుడుకు నిజంగానే వస్తుందని ఫీలయ్యాడో కానీ వెళ్లి ఆస్పత్రిలోచేరిపోయాడు. అతను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే పోలీసులు పట్టుకెళ్లి తమదైన పియానో వాయింపు రుచి చూపించే అవకాశం ఉంది. 

Also Read: Nalgonda: గుడిలో పూజారి.. చేసింది మాత్రం పాడు పని.. భార్య కూడా సహకారం, షాక్ అయిన పోలీసులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 09 Nov 2021 12:32 PM (IST) Tags: Telangana crime Nallagonda Nallagonda Crime Piano Crime Williamson Marriage Fraud

సంబంధిత కథనాలు

AP News : విహార యాత్రలో విషాదం, వాగులో ముగ్గురు విద్యార్థినులు గల్లంతు

AP News : విహార యాత్రలో విషాదం, వాగులో ముగ్గురు విద్యార్థినులు గల్లంతు

Student Commits Suicide : శివుడు పిలుస్తున్నాడని యువకుడు ఆత్మహత్య, మళ్లీ పుడతా అంటూ సూసైడ్ నోట్!

Student Commits Suicide : శివుడు పిలుస్తున్నాడని యువకుడు ఆత్మహత్య, మళ్లీ పుడతా అంటూ సూసైడ్ నోట్!

Kurnool Crime News: మద్యం మత్తులో కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

Kurnool Crime News: మద్యం మత్తులో కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

Snake Bite: స్టేషన్‌లోనే పాముకాటుకు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆందోళనలో పోలీసులు!

Snake Bite: స్టేషన్‌లోనే పాముకాటుకు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆందోళనలో పోలీసులు!

YSRCP MLC Anantababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ, బెయిల్ తిరస్కరించిన ధర్మాసనం

YSRCP MLC Anantababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ, బెయిల్ తిరస్కరించిన ధర్మాసనం

టాప్ స్టోరీస్

PK Fail : కేసీఆర్ జాతీయ రాజకీయాల అంచనాలను అందుకోని ప్రశాంత్ కిషోర్ పీకేతో కేసిఆర్ కు చెడింది అక్కడే..!

PK Fail : కేసీఆర్ జాతీయ రాజకీయాల అంచనాలను అందుకోని ప్రశాంత్ కిషోర్ పీకేతో కేసిఆర్ కు చెడింది అక్కడే..!

Karthikeya 2 OTT Release: దసరా స్పెషల్ - ఓటీటీ రిలీజ్‌కు 'కార్తికేయ2' రెడీ!

Karthikeya 2 OTT Release: దసరా స్పెషల్ - ఓటీటీ రిలీజ్‌కు 'కార్తికేయ2' రెడీ!

CUET PG Result: సీయూఈటీ పీజీ ఫలితాలు వెల్లడి, రిజల్ట్ ఇలా చూసుకోండి!

CUET PG Result:  సీయూఈటీ పీజీ ఫలితాలు వెల్లడి, రిజల్ట్ ఇలా చూసుకోండి!

Axar Patel Performance: రవీంద్ర జడేజా లేని లోటును దాదాపుగా తీర్చేసినట్టేనా..? | ABP Desam

Axar Patel Performance: రవీంద్ర జడేజా లేని లోటును దాదాపుగా తీర్చేసినట్టేనా..? | ABP Desam