News
News
X

Nalgonda: గుడిలో పూజారి.. చేసింది మాత్రం పాడు పని.. భార్య కూడా సహకారం, షాక్ అయిన పోలీసులు

నల్గొండ పట్టణంలో వ్యభిచారం గుట్టు సంచలనం రేపింది. నల్గొండ నగర శివారులోని దేవరకొండ రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై ఆదివారం నల్గొండ వన్‌ టౌన్‌ పోలీసులు దాడి చేశారు.

FOLLOW US: 

తెలంగాణలో ఒకే రోజు రెండు చోట్ల వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. నల్గొండ సహా హైదరాబాద్‌లో పోలీసులు రెండు వేర్వేరు వ్యభిచార ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు ఘటనల్లో పలువురు నిర్వహకులు సహా, విటులను అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతులను రక్షించి వ్యభిచార రొంపి నుంచి విముక్తి కల్పించారు. 

నల్గొండ పట్టణంలో వ్యభిచారం గుట్టు సంచలనం రేపింది. నల్గొండ నగర శివారులోని దేవరకొండ రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై ఆదివారం నల్గొండ వన్‌ టౌన్‌ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న రమేష్‌ చారి అనే వ్యక్తితో పాటు, అతడి భార్యను, మరో ఇద్దరు విటులు, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వెంటనే వారిని రిమాండ్‌‌కు తరలించామని పోలీసులు తెలిపారు. వ్యభిచార కూపంలో పట్టుబడ్డ ఓ డిగ్రీ విద్యార్థినితో పాటు మరో మహిళను సఖి కేంద్రానికి తరలించినట్లు చెప్పారు. భర్తతో గొడవపడి విడాకులు తీసుకున్న ఓ మహిళ విటురాలుగా ఉందని అన్నారు. అయితే, ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. రమేష్‌ చారి అనే వ్యక్తి తిప్పర్తి మండలంలో పూజారిగా పనిచేస్తున్నాడు.

Also Read: Telangana CM KCR ఢిల్లీలో ప్రధాని మోదీకి గులాంగిరీ.. ఇప్పుడు పోరాటమంటూ చెవుల్లో పూలు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లోనూ వ్యభిచార రాకెట్
హైదరాబాద్‌లోని బౌద్ధ నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై ఆదివారం చిలకలగూడ పోలీసులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన రేచల్‌ సోఫియా అనే 50 ఏళ్ల మహిళ నెల రోజుల క్రితం స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. పద్మారావు నగర్‌ ఏషియన్‌ వైన్స్‌లో పనిచేసే అప్పల అనిల్‌ (22) సహకారంతో అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. దీంతో ఆ గృహంపై దాడి చేసి పోలీసులు ఓ యువతికి విముక్తి కల్పించారు. ఓ విటుడిని కూడా అరెస్ట్‌ చేశారు.

Also Read: పన్ను కట్టేందుకు డబ్బు లేదు! షేర్లు అమ్మేసుకోనా అంటూ ట్విటర్లో మస్క్‌ పోల్‌

Also Read:  పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించకపోతే ప్రజలకే కాదు ప్రభుత్వానికీ నష్టమే..! ఎలాగో తెలుసా ?

Also Read : నాడు ఏం చెప్పారు ? నేడు ఏం చేస్తున్నారు ? పెట్రో ధరలను తగ్గించకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 08 Nov 2021 10:32 AM (IST) Tags: Nalgonda Police Prostitution Racket in Nalgonda Sex Racket in Hyderabad Nalgonda Sex Racket

సంబంధిత కథనాలు

Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య

Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య

Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!

Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో  జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!

Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..

Srinivas Goud Firing :  కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..

Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?

Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?

Kamareddy Bus Accident : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు బోల్తా, 25 మందికి గాయాలు

Kamareddy Bus Accident : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు బోల్తా, 25 మందికి గాయాలు

టాప్ స్టోరీస్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!