T Subbarami Reddy: సుబ్బరామిరెడ్డి కంపెనీకి భారీ టోకరా.. నిందితులు అరెస్టు, అసలేం జరిగిందంటే..
గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ వ్యాపార విస్తరణ కోసం రుణం కోసం యత్నాలు చేస్తున్న సమయంలో ఆ విషయం తెలుసుకున్న నిందితులు ఇందిరా రెడ్డిని సంప్రదించారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త టి.సుబ్బరామి రెడ్డికి చెందిన కంపెనీకి పలువురు టోకరా వేశారు. బ్యాంకులు కాని వేరే ఆర్థిక దిగ్గజ కంపెనీల నుంచి రుణం ఇప్పిస్తామంటూ మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డికి చెందిన నిర్మాణ సంస్థ గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ను నిందితులు మోసం చేశారు. ఈ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులు నిందితులు హర్ష వర్ధన్, బాలూభాయ్ పటేల్‌ను ముంబయిలో అరెస్టు చేశారు. వీరిద్దరూ తమకు అప్పు ఇప్పిస్తామని చెప్పారని, ఇందుకు షేర్లను కూడా తనఖా ఉంచుకున్నారని.. వాటిని అమ్మి రూ.105 కోట్లు కాజేశారని సుబ్బరామి రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి గత జులైలో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
అయితే, ప్రాసెసింగ్ ఫీజు పేరుతో షేర్ల పత్రాలను వారు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు.. నిందితులు ముంబయిలో ఉన్నట్లు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. 4 రోజుల కిందటే వారిని అరెస్టు చేయగా.. సోమవారం హైదరాబాద్‌కు తీసుకువచ్చి జైలుకు తరలించారు. సుబ్బరామి రెడ్డికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ సోమాజీగూడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది.
32.50 లక్షల షేర్ల తనఖా
గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ వ్యాపార విస్తరణ కోసం రుణం కోసం యత్నాలు చేస్తున్న సమయంలో ఆ విషయం తెలుసుకున్న నిందితులు ఇందిరా రెడ్డిని సంప్రదించారు. గత ఏడాది జూన్ నెలలో ఛాంపియన్ ఫిన్ సెక్ (సీఎఫ్‌ఎల్) అనే కంపెనీ ప్రతినిధులు ప్రతినిధులు హర్షవర్ధన్, బాలూ భాయ్ పటేల్‌లు ఇందిరా రెడ్డిని కలిశారు. రుణాలను బ్యాకింగేతర సంస్థల నుంచి రూ.11.50 కోట్ల రుణం ఇప్పిస్తామని చెప్పారు. రుణం మంజూరయ్యాక తమకు ఒక శాతం కమీషన్ ఇవ్వాలని కోరారు. అయితే, అంత మొత్తం రుణానికి గానూ పూచీకత్తుగా నిర్మాణ సంస్థ షేర్లు తనఖా పెట్టాలని కోరారు. అయితే, అందుకు అంగీకరించిన ఇందిరా రెడ్డి దాదాపు 32.50లక్షల షేర్లను సీఎఫ్‌ఎల్ పేరుకు ట్రాన్స్‌ఫర్ చేశారు.
Also Read: కుప్పంలో ఎన్నికల టెన్షన్.. మున్సిపల్ కమిషనర్ కు పసుపు కుంకుమ అందజేసిన టీడీపీ నేతలు
చాలా రోజులైనా రుణం అందకపోవడంతో హైదరాబాద్‌లోని సీఎఫ్‌ఎల్ కార్యాలయానికి ఇందిరా రెడ్డి వెళ్లారు. వెళ్లి చూడగా.. అక్కడ హర్షవర్ధన్, బాలూ భాయ్‌లు ఇద్దరూ లేరు. గాయత్రి ప్రాజెక్ట్స్ ప్రతినిధులకు అనుమానం వచ్చి సరిచూసుకోగా.. జులై 8న షేర్ మార్కెట్‌లో 32.50లక్షల షేర్లను నిందితులు అమ్ముకున్నట్లుగా గుర్తించారు. అయితే, ఆ రోజున షేర్ల విలువ రూ.105 కోట్లుగా ఉందని బాధితులు పోలీసులకు వివరించారు. మహారాష్ట్రలోని థానెకు చెందిన బాలూభాయ్ పటేల్ కొన్నేళ్ల కిందట ఛాంపియన్ ఫిన్‌సెక్ పేరుతో సంస్థను స్థాపించాడని, హైదరాబాద్, ముంబయిలోనూ కార్యాలయాలున్నాయని పోలీసులు విచారణలో భాగంగా గుర్తించారు.
Also Read : నెల్లూరులో వైసీపీ మైండ్ గేమ్.. నిరసనలతో టీడీపీ, సిగ్గు.. ఎగ్గు.. బుద్ధి లేదంటూ ఫైర్
Also Read: ఆయన కంఠంలో ‘ఉక్కు’ తూటా! స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మరోపోరుకు సిద్ధమైన శంకరరావు..