Hyderabad Dancer Death: అర్ధనగ్న స్థితిలో మహిళా డాన్సర్ మృతి.. పక్కనే బీరు బాటిల్
ఆర్కేస్ట్రా గ్రూపులో డాన్సర్‌గా పని చేసే ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్‌లో ఓ డాన్సర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. ఆమె శవం అర్ధ నగ్న స్థితిలో ఉండడం మరింత అనుమానాలకు తావిచ్చింది. అంతేకాక, పక్కనే మద్యం సీసాను కూడా పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్‌లోని ముస్తఫానగర్‌లో ఈ ఘోరం జరిగింది. మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పూర్తి వివరాలివీ..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్కేస్ట్రా గ్రూపులో డాన్సర్‌గా పని చేసే ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక ముస్తఫానగర్‌కు చెందిన షరీన్ ఫాతిమా అనే 30 ఏళ్ల మహిళకు ఏడుగురు సంతానం ఉన్నారు. భర్త నదీం చనిపోవడం వల్ల ఆమె ఆర్కేస్ట్రా ట్రూపులో డ్యాన్సర్‌గా చేరి జీవనం సాగిస్తోంది.
అయితే, మూడు రోజుల క్రితమే ఆమె మరో ప్రాంతం నుంచి ముస్తఫా నగర్‌కు మారింది. ఈ క్రమంలో అక్కడ ఇల్లు అద్దెకు తీసుకున్న ఆమె ఆదివారం ఇంటి సామగ్రిని తరలించేందుకు కూలీలను మాట్లాడుకుంది. ఇల్లు షిఫ్టింగ్ ఉండడంతో పిల్లలను అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉంచింది. ఆమె కొత్త ఇంటికి వచ్చి తిరిగి రాకపోవడంతో ఫాతిమా తల్లి వచ్చి చూడగా అప్పటికే చనిపోయి కనిపించింది. ఆమె గొంతుపై గాయాలు ఉండటంతో పాటు అర్ధ నగ్నంగా ఉంది. పక్కనే బీరు బాటిల్ ఉండటంతో ఎవరో హత్య చేసి ఉంటారని ఫాతిమా సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read: Hyderabad: కన్నతల్లి ఇంట్లోనే కూతురు దొంగతనం.. గంటల్లోనే అడ్డంగా దొరికిపోయింది ఇలా..
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించారు. దీన్ని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, ఫాతిమా భర్త గతంలో చనిపోవడం, తాజాగా తల్లి కూడా మరణించడం వల్ల ఆమె ఏడుగురు పిల్లలు అనాథలు అయ్యారు.
Also Read: Nalgonda: గుడిలో పూజారి.. చేసింది మాత్రం పాడు పని.. భార్య కూడా సహకారం, షాక్ అయిన పోలీసులు
Also Read: పోర్న్ చూసేందుకు అలవాటు పడ్డాడు.. ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశాడు.. మరో చిన్నారిని చంపేసి మరి..