Hyderabad: కన్నతల్లి ఇంట్లోనే కూతురు దొంగతనం.. గంటల్లోనే అడ్డంగా దొరికిపోయింది ఇలా..
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌద్ధ నగర్‌లో ఈ చోరీ జరిగింది. కన్న తల్లి ఇంట్లోనే ఓ కుమార్తె దొంగతనం చేసింది. ఇంటి తాళాలు పగలగొట్టి ఏకంగా 10 తులాల బంగారం, 70 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకుపోయింది.
ఓ కుమార్తె డబ్బుల కోసం ఆశపడి ఏకంగా కన్న తల్లి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడింది. ప్రియుడ్ని మతాంతర వివాహం చేసుకున్న ఆమె ఏకంగా పుట్టింటికే కన్నం వేసింది. వివాహం అనంతరం పేరు మార్చుకోవడం వల్ల తాను చేసే నేరం బయటికి రాదనుకున్న ఆమె ఈ చోరీకి పాల్పడింది. కానీ, ఫిర్యాదు అందుకున్న గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితురాలు ఆమెనే అని గుర్తించేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌద్ధ నగర్‌లో ఈ చోరీ జరిగింది. కన్న తల్లి ఇంట్లోనే ఓ కుమార్తె దొంగతనం చేసింది. ఇంటి తాళాలు పగలగొట్టి ఏకంగా 10 తులాల బంగారం, 70 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకుపోయింది. గంటల వ్యవధిలోనే చిలకలగూడ పోలీసులు కేసును ఈ ఛేదించారు. బౌద్ధనగర్‌లో నివసించే రాణికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె 37 ఏళ్ల మేరీ. ఈమె మరో మతానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అనంతరం పేరును మోహర్ బేగం, ఆలియాస్ షేక్ షాదుల్లాగా మార్చుకుంది. రాణి మిగతా నలుగురు కుమార్తెలను తీసుకుని ఈనెల 3వ తేదీన గోవాకు వెళ్లింది. ఇంటి తాళం పక్కన నివసించే బార్లా శ్రీకాంత్ అనే వ్యక్తికి ఎప్పటిలాగే ఇచ్చింది.
Also Read: పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించకపోతే ప్రజలకే కాదు ప్రభుత్వానికీ నష్టమే..! ఎలాగో తెలుసా ?
ఈ నెల 4వ తేదీ సాయంత్రం 8 గంటల సమయంలో ఇంటికి వచ్చిన శ్రీకాంత్‌కు రాణి ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నట్లు కనిపించాయి. వెంటనే అతను చిలకలగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. దీంతో వాటి ఆధారంగా దొంగతనానికి పాల్పడింది.. ఆమె కుమార్తెనే అని నిర్ధరించారు.
మేరీని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా.. రాం నగర్‌కు చెందిన ఇబ్రహీముద్దీన్ ఫరోకి అలియాస్ ఇబ్రహీం అనే 37 ఏళ్ల వ్యక్తి సహాయంతో బంగారు, వెండి నగలు దొంగిలించానని నిందితురాలు ఒప్పుకుంది. ఆమెతో పాటు సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 10 తులాల బంగారు నగలు, 70 తులాల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం జరిగిన కాసేపటిలోనే కేసును ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు ప్రశంసించారు.
Also Read: ఎన్నోసార్లు మెడలు నరుక్కుంట అన్నవ్.. మా మెడలు ఇరుస్తవా? కేసీఆర్‌పై విజయశాంతి సంచలనం
Also Read: పంజాగుట్ట బాలిక మిస్టరీ కేసులో స్పష్టత, చనిపోయింది అందుకే.. కానీ,
Also Read: పన్ను కట్టేందుకు డబ్బు లేదు! షేర్లు అమ్మేసుకోనా అంటూ ట్విటర్లో మస్క్ పోల్
Also Read: Nalgonda: గుడిలో పూజారి.. చేసింది మాత్రం పాడు పని.. భార్య కూడా సహకారం, షాక్ అయిన పోలీసులు