Panjagutta Girl Death: పంజాగుట్ట బాలిక మిస్టరీ కేసులో స్పష్టత, చనిపోయింది అందుకే.. కానీ,
బాలిక శవానికి అప్పుడే పోస్టుమార్టం నిర్వహించారు. దానికి సంబంధించిన నివేదిక తాజాగా వెల్లడైంది. కడుపులో బలంగా తన్నడం వల్లనే బాలిక చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది.
![Panjagutta Girl Death: పంజాగుట్ట బాలిక మిస్టరీ కేసులో స్పష్టత, చనిపోయింది అందుకే.. కానీ, Panjagutta Girl Death Case: She Dies with strong throbbing in her stomach, Says Postmortem Report Panjagutta Girl Death: పంజాగుట్ట బాలిక మిస్టరీ కేసులో స్పష్టత, చనిపోయింది అందుకే.. కానీ,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/07/891ad10ae23d947453692652e62f5185_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఓ ఐదేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయి పడి ఉన్న సంగతి తెలిసిందే. గత నెల 4న పంజాగుట్టలో ఓ దుకాణం ముందు ఈ ఘటన వెలుగు చూసింది. బాలిక శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆమె మృతిపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఇప్పటిదాకా ఆ బాలిక మరణాకికి సంబంధించి ఎలాంటి వివరాలను పోలీసులు గుర్తించలేకపోయారు. కానీ, బాలిక చనిపోవడానికి గల కారణం మాత్రం తెలిసింది.
బాలిక శవానికి అప్పుడే పోస్టుమార్టం నిర్వహించారు. దానికి సంబంధించిన నివేదిక తాజాగా వెల్లడైంది. కడుపులో బలంగా తన్నడం వల్లనే బాలిక చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది. కాబట్టి, బాలికను హత్య చేసి ఉంటారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.
Also Read: పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించకపోతే ప్రజలకే కాదు ప్రభుత్వానికీ నష్టమే..! ఎలాగో తెలుసా ?
బాలిక మృత దేహాన్ని గుర్తు తెలియని ఓ మహిళ వదిలేసి వెళ్లినట్లుగా పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఎక్కడో చంపి మృతదేహాన్ని ఆ ప్రాంతంలో వదిలి వెళ్లినట్లుగా గుర్తించారు. ఇప్పటికే నిందితులను గుర్తించిన పోలీసులు.. వారు వెళ్లిన దారిలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం నాలుగు పోలీస్, మూడు టాస్క్‌ఫోర్స్ బృందాలతో గాలిస్తున్నారు.
Also Read: ఎన్నోసార్లు మెడలు నరుక్కుంట అన్నవ్.. మా మెడలు ఇరుస్తవా? కేసీఆర్‌పై విజయశాంతి సంచలనం
ఈ నెల 4న ద్వారకాపురి కాలనీలో ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ.. సామాజిక మాధ్యమాల్లో బాలిక చిత్రాన్ని విడుదల చేసినట్టు పోలీసులు వెల్లడించారు. సదరు బాలిక గురించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు వెల్లడించారు. ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి 94906 16610, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ నాగయ్య 94906 16613, ఎస్‌ఐ సతీష్ 94906 16365 లను ఈ నెంబర్లలో సంప్రదించవచ్చని వెల్లడించారు.
Also Read: పన్ను కట్టేందుకు డబ్బు లేదు! షేర్లు అమ్మేసుకోనా అంటూ ట్విటర్లో మస్క్ పోల్
Also Read: Nalgonda: గుడిలో పూజారి.. చేసింది మాత్రం పాడు పని.. భార్య కూడా సహకారం, షాక్ అయిన పోలీసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)