By: ABP Desam | Updated at : 08 Nov 2021 09:47 PM (IST)
rape-crime
అభశుభం తెలియని చిన్నపిల్లలపై ఓ వ్యక్తి కామవాంఛ తీర్చుకున్నాడు. రోజుల వ్యవధిలోనే ముగ్గురు చిన్నారులపై అత్యాచారం చేశాడు. అందులో ఓ బాలికను హత్య చేశాడు. మూడేళ్ల బాలికను అత్యాచారం చేస్తుండగా.. కేకలు వేస్తోందేమోననే కారణంతో చంపేశాడు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయ్ అఘాయిత్యాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు గాంధీనగర్ ఐజీపీ అభయ్ చుదసమా తెలిపారు.
అసలు ఏమైందంటే.. గుజరాత్, గాంధీనగర్ జిల్లా కలోల్ మండలం వన్సజదా గ్రామానికి చెందిన విజయ్ ఠాకూర్ కూలీగా పని చేసేవాడు. అయితే అతడికి ఫోన్ లో పోర్న్ వీడియోలు చూడటం ఎక్కువగా అలవాటు ఉండేది. పెద్ద వాళ్లపై అఘాయిత్యం చేస్తే.. ఎదురు తిరుగుతారనే ఆలోచనలో ఉండేవాడు. చిన్నపిల్లలను టార్గెట్ చేసుకున్నాడు. నవంబరు 4న రంచర్దా గ్రామంలో ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఎవరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి.. అత్యాచారం చేశాడు. అదే రోజు గ్రామంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో చిన్నారిని వదిలి పెట్టాడు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్నారి తల్లికి అనుమానం వచ్చింది. బాలికకు పరీక్షలు చేయించగా.. అత్యాచారానికి గురైనట్లు తెలిసింది. ఈ ఘటనపై సంతెజ్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు మరుసటి రోజూ మరో బాలికను కిడ్నాప్ చేశాడు. మళ్లీ చిన్నారిని ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు. అత్యాచారం చేస్తున్న సమయంలో ఆ చిన్నారి కేకలు వేసింది. పాపను చంపేసి అత్యాచారం చేశాడు. దగ్గరలో ఉన్న కల్వర్టులో మృతదేహాన్ని పడేశాడు. ఈ ఘటనపైనా.. సంతెజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ మెుదలుపెట్టారు. సీసీటీవీ దృశ్యాలు పరిశీలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విజయ్ ని అరెస్టు చేశారు. దర్యాప్తు చేస్తుంటే మరిని నిజాలు బయటకు వచ్చాయి. 10 రోజుల కిందట.. డ్రెస్ కొనిస్తానని చెప్పి.. మరో బాలికపై అత్యాచారం చేశాడు. బాలికకు బట్టలు కొనిస్తానని మాయమాటలు చెప్పి వాంఛ తీర్చుకున్నట్లు దర్యాప్తులో తెలిసింది.
Also Read: Hyderabad: కన్నతల్లి ఇంట్లోనే కూతురు దొంగతనం.. గంటల్లోనే అడ్డంగా దొరికిపోయింది ఇలా..
Also Read: Panjagutta Girl Death: పంజాగుట్ట బాలిక మిస్టరీ కేసులో స్పష్టత, చనిపోయింది అందుకే.. కానీ,
Also Read: Nalgonda: గుడిలో పూజారి.. చేసింది మాత్రం పాడు పని.. భార్య కూడా సహకారం, షాక్ అయిన పోలీసులు
Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య
France stabbing: ప్రీస్కూల్‌లోని చిన్నారులపై కత్తితో దాడి చేసిన సైకో, 9 మందికి తీవ్ర గాయాలు
Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
Maharashtra Crime: క్రికెట్ ఆడే విషయంలో గొడవ, 12 ఏళ్ల బాలుడిని బ్యాట్‌తో కొట్టి చంపిన మరో బాలుడు
CM Jagan Gudivada Tour: సీఎం జగన్ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!
Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?
MP Avinash Reddy Arrest In YS Viveka Case: ఈ నెల 3వ తేదీన అరెస్ట్ చేసిన సీబీఐ
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం