Delhi Car Blast Amit Shah PM Modi | ఢిల్లీ బ్లాస్ట్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశం | ABP Desam
ఢిల్లీలో జరిగిన కారు బ్లాస్ట్ పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశాలిచ్చారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర కారు పేలిన ఘటనలో 10మంది మృతి చెందగా...ఘటనకు కారణాలపై ఫోరెన్సిక్, NIA, NSG బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. ట్రాఫిక్ సిగ్నల్ లో ఆగిన కారులో పేలుడు సంభవించందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఘటనపై ప్రాథమిక వివరాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి తెలిపినట్లు సీపీ ప్రకటన చేశారు. అయితే ఘటనపై ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాల్ చేశారు. పూర్తి దర్యాప్తు చేయించాలని ఘటనకు కారణాలను వీలైనంత త్వరగా అన్వేషించాలని మోదీ అమిత్ షాను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఢిల్లీ ఘటన తర్వాత హై అలెర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా అధికారిక ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం 06.52నిమిషాలకు ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ కారు వచ్చి మెల్లగా ఆగిందన్న పోలీ స్ కమిషనర్...రెడ్ లైట్ పడటంతో దాని వెనుకాలే మరికొన్ని కార్లు, ఆటోలో వాహనాలు వచ్చి ఆగాయి. ఈలోగా మొదటు ఆగిన కారు నుంచి పేలుడు సంభవించిందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఘటనలో కొంత మంది ప్రాణాలు కోల్పోయారన్న సీపీ...జరిగిన ఘటనపై దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ బృందాలు, NIA, NSG టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయన్నారు. హోంమంత్రి అమిత్ షాకు ఘటనపై ప్రాథమిక వివరాలు అందించామని ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా ప్రకటించారు.





















