Amit Shah on Delhi Car Blast | ఢిల్లీ కారు బ్లాస్ట్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రియాక్షన్ | ABP Desam
ఢిల్లీలో కారు బ్లాస్ట్ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హ్యూండాయ్ ఐ20 కారులో బ్లాస్ట్ జరిగిందన్న అమిత్ షా...ఆ కారుతో పాటు పక్కనే ఉన్న వాహనాలు..పాదచారులపైనా పేలుడు ప్రభావం పడిందన్నారు. ఘటనలో కొంత మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఘటన జరిగిన పదినిమిషాల్లోనే NIA, NSG, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయన్న అమిత్ షా...చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా వెతికి...త్వరలోనే ప్రాథమిక వివరాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. తనే స్వయంగా పేలుడు ఘటన జరిగిన ప్రదేశానికి...ఆసుపత్రికి వెళ్తానని అమిత్ షా ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా అధికారిక ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం 06.52నిమిషాలకు ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ కారు వచ్చి మెల్లగా ఆగిందన్న పోలీ స్ కమిషనర్...రెడ్ లైట్ పడటంతో దాని వెనుకాలే మరికొన్ని కార్లు, ఆటోలో వాహనాలు వచ్చి ఆగాయి.





















