Pillars of Creation Explained in Telugu | పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ కరిగిపోతున్నాయ్ | ABP Desam
మీకు ఎప్పుడైనా మన సూర్యుడు ఎలా ఏర్పడ్డాడు అని డౌట్ వచ్చిందా. ఒక సింగిల్ నక్షత్రమైన సూర్యుడు ఎలా మన సౌరకుటుంబంలోని ఇన్ని గ్రహాలకు వెలుగును పంచుతున్నాడు. భూమి లాంటి గ్రహం మీద జీవం మనుగడకు ఎలా కారణం అవుతున్నాడు. అసలు సూర్యుడు లాంటి నక్షత్రాలు ఇంకా పెద్దవో లేదో చిన్నవో ఎలా ఏర్పడుతున్నాయి. ఎక్కడి నుంచి ఇవి పుడుతున్నాయి. మనిషి టెలిస్కోపు కనిపెట్టనంత వరకూ ఇవన్నీ మిస్టరీలే. ఈ అనంతమైన విశ్వాన్ని తను కనిపెట్టిన టెలిస్కోపుతో మనిషి చూడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి మన శాస్త్రవేత్తలను వెంటాడుతున్న ఈ ప్రశ్నకు సమాధానం తొలిసారిగా 1995లో లభించింది. ఎక్కడో భూమికి 6500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ నెబ్యూలా లో కనిపించిన ఈ ఖగోళ అద్భుతాన్ని చూసి యావత్ విజ్ఞాన శాస్త్ర ప్రపంచమే నివ్వెరపోయింది అదే పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్. ఈ వారం అంతరిక్ష కథల్లో పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ గురించి మాట్లాడుకుందాం.





















