Konaseema News : మళ్లీ టెన్షన్‌లో కోనసీమ - ఈ సారి కుంతీదేవి జాతరలో...
కోనసీమ కుంతీ దేవి జాతరలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Konaseema News : కోనసీమ జిల్లాను వివాదాలు.. ఘర్షణలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించాల్సి వచ్చింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వేల్ల గ్రామంలో కుంతీదేవి జాతర ప్రతీ ఏటా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా అలాగే ఏర్పాటు చేశారు.
గారడి ప్రదర్శకుల మధ్య వివాదం
అయితే జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన గారడీ ప్రదర్శకుల మధ్య వివాదం ఏర్పడింది. రాయవరం మండలం మాచవరం గ్రామం చెందిన గారడీ ప్రదర్శకులు కపిలేశ్వరం మండలం వెదురుమూడి గ్రామ ప్రదర్శకులు ఒకరిపై ఒకరు గారడీ కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిలో కొంత మందిని స్థానికంగా వెల్ల ఆసుపత్రిలో చేర్పించారు. కొంత మందకి రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పదో తరగతి తప్పిన వైఎస్ఆర్‌సీపీ నేతల కోసం త్వరలో జూమ్ మీటింగ్ - జగన్‌నూ ఆహ్వానిస్తామన్న టీడీపీ !
ఘర్షణలో పలువురికి గాయాలు
వెల్ల గ్రామంలో జరుగుతున్న కుంతీదేవి జాతరలో 12 గ్రామాలకు చెందిన గారడీ ప్రదర్శకుల ను రప్పించి గ్రామస్తులు వీక్షించే లా ఊరంతా తిరుగుతూ ప్రదర్శనలు చేస్తారు. ఈ నేపథ్యంలో మాచవరం ఎదురు ముడి గ్రామాల మధ్య పోటీ ఏర్పడింది ఒకరు గొప్ప అంటే ఒకరు గొప్ప అని చెప్పుకుంటూ ఘర్షణ వాతావరణం ఏర్పడేలా ప్రదర్శన చేస్తూ ఒకరిపై ఒకరు కత్తులతో తీవ్ర గాయాలపాలయ్యారు ఒకరి పరిస్థితి విషమం అతనిని కాకినాడ జిజిహెచ్ కి తరలించారని పోలీసులు ప్రకటించారు.
గది కేటాయించలేదని టీటీడీ ఉద్యోగిపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పీఆర్వో దాడి - తిరుమలలో కలకలం !
ముందస్తు జాగ్రత్తగా పోలీసుల మోహరింపు
కోనసీమ జిల్లాలో సున్నితమైన పరిస్థితులు ఉండటంతో వెల్ల లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితులను వెంటనే అదుపులోకి తెచ్చినా ముందు జాగ్రత్తగా పోలీసు బలగాల్ని మోహరిస్తున్నారు. ఇటీవల కోనసీమలో జిల్లా పేరు మీద ప్రారంభమైన రగడ చివరికి భారీ ఘర్షణలకు దారి తీసింది. ఈ కారణంగా చాలా రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపివేశారు. అయినా పలు చోట్ల ఉద్రిక్తతలు ఏర్పడుతూండటంతో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
క్రూయిజ్ షిప్ అంటే అలలపై ఇంద్రభవనం లాంటిది.. లోపల ఎలా ఉంటుందో తెలుసా?