(Source: ECI/ABP News/ABP Majha)
Tirumala Attack : గది కేటాయించలేదని టీటీడీ ఉద్యోగిపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పీఆర్వో దాడి - తిరుమలలో కలకలం !
తిరుమలలో గది కేటాయించలేదని టీటీడీ ఉద్యోగిపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనుచరుడు దాడి చేశారు.
Tirumala YSRCP Attack : తిరుమలలో అధికార పార్టీ నేతల ప్రైవేటు పీఆర్వోలు బరి తెగిస్తున్నారు. తాము అడిన అతిధి గృహాలు కేటాయించక పోతే దాడులకు సైతం తెగబడుతున్నారు. టిటిడి సిబ్బందిపై నేరుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఇతర అధికారులపై రుబాబు చేస్తున్నారు. గురువారం ఉదయం టిటిడి ఈవో ధర్మారెడ్డి కుమారుడి నిశ్చితార్థం ఉండడంతో తిరుమలలోని పద్మావతి సముదాయంలోని అతిధి గృహాలను టిటిడి అధికారులు బ్లాక్ చేశారు దీంతో పద్మావతి సముదాయంలో గదుల కేటాయింపు కొంత మందికి మాత్రమే పరిమితం చేశారు అధికారులు. సిఫార్సు లేఖలు కలిగిన వారికి ఎంబిసీ 34 లో గదులు కేటాయింపు జరిగింది.
బుధవారం రాత్రి 10 గంటల సమయంలో తిరుపతి జిల్లాకు ఓ ఎమ్మెల్యే పిఆర్వో ఎంబిసీ-34 వద్దకు b;d;ejg. తనకు ఓ అతిధి గృహాన్ని కేటాయించాలని గదుల కేటాయింపులో ఉన్న సీనియర్ అసిస్టెంట్ వెంకటరత్నంను కోరాడు. గదులు ఖాళీ లేవని, ఖాళీ కాగానే తమకు కేటాయిస్తామని బదులు ఇచ్చి వేచి ఉండమని చెప్పాడు. దీంతో దాదాపు గంటన్నర వరకూ ఎమ్మెల్యే పిఆర్వో కేటాయింపు కేంద్రం వద్దే వేచి ఉన్నా అతిధి గృహం కేటాయించలేదు. ఒక్క సారిగా ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే పిఆర్వో నవీన్ కుమార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న వెంకటరత్నంతో వాగ్వాదానికి దిగాడు. ఒకరినొక్కరు తీవ్రంగా దూషించుకునే స్ధాయి వరకూ వీరి గొడవ దారి తీసింది. అదే సమయంలో అక్కడ ఉన్న కొందరు టిటిడి సిబ్బంది, భక్తులు ఇరువురిని సముదాయించి అక్కడి నుండి పంపి వేశారు.
తర్వాత ఎమ్మెల్యే పిఆర్వో నవీన్ స్ధానికంగా ఉన్న కొందరు వ్యక్తులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.. తన ఎమ్మెల్యేకు అవసరం అయ్యే అతిధి గృహాన్ని కూడా కేటాయించలేరా అంటు ఆగ్రహించిన వారు.. నేరుగా ఎంబిసీ-34 వద్దకు చేరుకుని కార్యాలయం తలుపులు తీయాలంటూ గెట్టిగా కేకలు వేస్తూ గది తలుపులను కాలితో తన్ని హడావుడి చేశారు.. దీంతో కార్యాలయంలో నుండి బయటకు వచ్చిన సీనియర్ అసిస్టెంట్ వెంకటరత్నం వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించాడు.. వచ్చిన వారు తిరుమల స్ధానికులు అవడంతో పరిస్థితిని అర్ధం అయ్యేలా వివరించే ప్రయత్నం చేసే లోపే పృద్వీరాజ్ అలియాస్ బబ్లూ అనే యువకుడు ఒక్కసారిగా టిటిడి ఉద్యోగి వెంకటరత్నంపై పిడిగుద్దులు గిద్దాడు.. అక్కడ ఉన్న వారు ఎంత ఆపేందుకు ప్రయత్నం చేసిన వారి మాట లెక్క చేయకుండా టిటిడి సిబ్బందిని దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో..తనకు ఎటువంటి భయం లేదని టిటిడి అధికారిని హెచ్చరించాడు.. తీవ్ర గాయాల పాలైన వెంకటరత్నం తిరుమల టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్ధలంకు పోలీసులు చేరుకునే లోపే నిందితుడు బబ్లూ ఘడన స్ధలం నుండి పరార్ అయ్యాడు.. టిటిడి ఉద్యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భాధితుడిని అశ్వినీ ఆసుపత్రికి తరలించి బబ్లూని అదుపులోకి తీసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు..
తిరుమల స్ధానికుడిగా ఉంటూ టిటిడి ఉద్యోగిపై దాడి చేయడమే కాకుండా భక్తులను భయాందోళనకు గురి చేసిన బబ్లూపై కఠిన చర్యలు తీసుకోవాలని పొలీసులు అధికారులను టిటిడి ఈవో ఆదేశించినట్లు తెలుస్తొంది.. అంతే కాకుండా టిటిడి ఉద్యోగిపై దాడిని పలువురు నాయకులు ఖండించారు .తిరుమల పవిత్రతను ఒక పక్కా ప్రణాళికతో వైసీపి ప్రభుత్వం దెబ్బ తీస్తోందని, వెంకన్న సన్నిధిని నిత్య వివాదాల కేంద్రంగా మార్చేశారని నారా లోకేష్ విమర్శించారు.
తిరుమల పవిత్రతను ఒక పక్కా ప్రణాళికతో దెబ్బతీస్తోంది వైసిపి ప్రభుత్వం. వెంకన్న సన్నిధిని నిత్య వివాదాల కేంద్రంగా మార్చేశారు @ysjagan గారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకొని అనేక ఇబ్బందులకు గురిచేశారు.(1/3) pic.twitter.com/Xk6dVTuUdd
— Lokesh Nara (@naralokesh) June 9, 2022
భక్తులకు, సిబ్బందికి రక్షణ కల్పించ లేకపోవడం టిటిడి, ప్రభుత్వ వైఫల్యమే. టిటిడి సిబ్బంది పై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్ చేశారు.. ఇదే విషయంపై బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోమ్మువీర్రాజు సైతం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు అయినంత మాత్రాన అధికారులు గదులు కేటాయించి సలాం కొట్టాలా? టీటీడీ అధికారి పై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.పోలీసుల సహకారంతో రాష్ట్ర ప్రజలు,వ్యక్తుల స్వేచ్ఛను... (1/2)@blsanthosh @JPNadda pic.twitter.com/qCeGBLsVAV
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) June 9, 2022