By: ABP Desam | Updated at : 07 May 2022 01:02 PM (IST)
చంద్రగిరి ఎస్ఐ ఆరెస్ట్ - ఈయన నిర్వాకానికి ఓ యువతి ప్రాణం బలి !
ఆయనో సబ్ ఇన్స్‌పెక్టర్. ( SI ) చేయాల్సిన పని నేరాలను అరికట్టడం. కానీ తన పోలీస్ డ్రెస్‌ను చూపించి అమ్మాయిలను వలలో వేసుకోవడం.. వంచించడాన్నే అలవాటుగా చేసుకున్నాడు. ఇలా వంచనకు గురైన ఓ యువతి ఆత్మహత్య ( Women Suiside ) చేసుకోవడంతో.. ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. ఆ ఎస్‌ఐ పేరు విజయ్ కుమార్. ( SI Vijaykumr ) ప్రస్తుతం చంద్రగిరి ( Chandragiri PS ) పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నారు.
అనంతపురం జిల్లా, జి ఏ కొట్టాల కు చెందిన సరస్వతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం ( Suiside ) చేసింది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి చంద్రగిరి ఎస్ఐ విజయ్ కుమార్ కారణం అని మరణ వాంగ్మూలంలో చెప్పింది. అతను తనను ఎలా ప్రేమ పేరుతో మోసం చేశాడో కూడా వివరించింది. ఆమెను రక్షించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. ఆమె చనిపోయింది. తిరుపతిలో ( Tirupati ) డిగ్రీ చదువుతున్న సమయంలో ఎస్ ఐ విజయ్ కుమార్ ఆమెను ట్రాప్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
36 ఏళ్ల మహిళపై పోక్సో కేసు - ఎంత ఘోరానికి పాల్పడిందంటే ?
అయితే విజయ్ కుమార్ ఒక్క సరస్వతినే కాదు మరికొంత మంది అమ్మాయిల్ని కూడా ట్రాప్ చేశారు. ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఇటీవల దిశ పోలీస్ స్టేషన్‌లో ( Disa Police Station ) ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్‌ఐ ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన సరస్వతి తాను మోసపోయానని భావించి ఆత్మహత్య చేసుకుంది.
విశాఖలో కలకలం - విద్యార్థిపై దాడి చేసిన గసగసాలు, ఎలక !
సరస్వతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు తాడిపత్రి పోలీసులు ( Tadipatri Police ) కేసు నమోదు చేశారు. చంద్రగిరిలో అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లుగా తాడిపత్రి డీఎస్పీ ప్రకటించారు. ఎస్ ఐ పై కేసు నమోదు చేశామని గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులొచ్చాయని డీఎస్పీ చైతన్య ( DSP Chaitanya ) తెలిపారు. ఫిర్యాదులొస్తే వివాదాల మధ్యే విజయకుమార్ వివాహం జరిగిందన్నారు. మహిళలను ఎవరైనా వేధిస్తే కాపాడాల్సిన పోలీసు తానే ప్రేమ పేరుతో ట్రాప్ చేయడంతో ఓ యువతి ప్రాణం బలైపోయింది.
Nara Lokesh : ఎమ్మెల్సీ కారులో మృతదేహం ఘటనపై లోకేశ్ ఫైర్, హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని ఆరోపణ!
MLC Car Dead Body : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ, కొట్టిచంపారని కుటుంబసభ్యుల ఆరోపణ
Guntur News : గుంటూరు జిల్లాలో దారుణం, మహిళను లారీతో ఈడ్చుకెళ్లిన డ్రైవర్
Guntur Crime : వాలంటీర్ ని కొట్టి చంపిన మైనర్, రూ. 2 వేలు తిరిగి ఇవ్వమన్నందుకు దారుణం
Chittoor Crime: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను లాక్కెళ్లిన వృద్ధుడు, ఆపై దారుణం ! తల్లి రాగానే అక్కడినుంచి పరార్
CBI Raids: లాలూ యాదవ్కు మరో షాక్- కొత్త అభియోగాలు మోపిన సీబీఐ
Covid-19 Cases India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి
Stock Market News: శుక్రవారం డబ్బుల వర్షం! రూ.5.5 లక్షల కోట్లు ఆర్జించిన ఇన్వెస్టర్లు, సెన్సెక్స్ 1163+
CM KCR Tour : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ గురి, నేటి నుంచి వరుస పర్యటనలు