Crime News : 36 ఏళ్ల మహిళపై పోక్సో కేసు - ఎంత ఘోరానికి పాల్పడిందంటే ?
చెన్నైలో 36 ఏళ్ల మహిళపై పోక్సో కేసు పెట్టమని కోర్టు ఆదేశించింది. ఆమె ఎంత ఘోరానికి పాల్పడిందంటే ?
తమిళనాడులో అభిరామి అనే 36 ఏళ్ల మహిళపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం అంటే చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే ఈ చట్టం కింద కేసు పెడతారు. అయితే అభిరామి ఏ చిన్న పిల్లవాడిపైనా అఘాయిత్యానికి పాల్పడలేదు. కానీ తన మైనర్ కూతుర్ని అడ్డం పెట్టుకుని మాజీ ప్రియుడిపై కేసులు బనాయించాలనుకుంది. చివరికి కుట్ర బయటపడి.. అది ఆమెపైనే రివర్స్ కేసులకు దారి తీసింది.
బిచ్చగాడితో గొడవ పెట్టుకుని మరీ చంపేశారు ! ఇలాంటి సైకోలు కూడా ఉంటారా?
చెన్నైలో ఉండే అభిరామికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు అమ్మాయి..ఇంకొకరు అబ్బాయి. భర్తతో విభేదాలు రావడంతో వదిలేసింది. పిల్లలతో వేరుగా ఉంటోంది. తాను ఉండే కాలనీలో జార్జిఫెర్నాండెజ్ అనే వ్యక్తి పరిచయం అవడంతో అతనికి దగ్గరయింది. ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. మధ్యలో ఏమయిందో కానీ జార్జ్ ఫెర్నాండెజ్‌తోనూ అభిరామికి గొడవలు వచ్చాయి. ఇద్దరూ విడిపోయారు. అయితే ఓ రోజు ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన మైనర్ కూతుర్ని జార్జ్ ఫెర్నాండెజ్ లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదని పోలీస్ స్టేషన్ ముందే కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. దీంతో కంగారు పడిన పోలీసులు జార్జ్ ఫెర్నాండెజ్‌పై కేసులు పెట్టారు.
విశాఖలో కలకలం - విద్యార్థిపై దాడి చేసిన గసగసాలు, ఎలక !
ఆయనను అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద పెట్టడంతో చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు. చివరికి కండిషనల్ బెయిల్‌పై విడుదలయ్యారు. ఇటీవల ఈకేసు విచారణకు వచ్చింది. అయితే అభిరామి ప్లేట్ ఫిరాయించింది. తన కుమార్తెపై ఫెర్నాండెజ్ ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని.. చెప్పుకొచ్చింది. తప్పుడు ఫిర్యాదు చేసినట్లుగా అంగీకరించింది. ఎందుకు అంటే.. ఆ జార్జ్ ఫెర్నాండెజ్‌తో మళ్లీ అభిరామి కలసి సహజజీవనం చేస్తోంది. పాత గొడవలన్నీ మర్చిపోయింది. ఈ విషయం కూడా చెప్పడంతో కోర్టు ఆగ్రహించింది. పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకు ఆమెపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని పోలీసుల్ని అప్పటిక్పపుడు ఆదేశించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఏపీలో ఆ రెండు కార్పొరేషన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు గల్లంతు ? అసలేం జరిగింది ?
సున్నితమైన చట్టాల విషయంలో తప్పుడు ఫిర్యాదుల వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అభిరామి లాంటి వాళ్లు వ్యక్తిగత గొడవలతో తప్పుడు ఫిర్యాదులు చేయడంతో ఆ చట్టాలు బలహీనం అవుతున్నాయి. అలాంటి వారికి కఠిన శిక్షలు వేస్తేనే చట్టాల్ని దుర్వినియోగం చేసే పరిస్థితి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.