Vizag Crime News : విశాఖలో కలకలం - విద్యార్థిపై దాడి చేసిన గసగసాలు, ఎలక !
విశాఖలో టెన్త్ విద్యార్థిపై దండుపాళ్యం ముఠా దాడి చేసింది. పదో తరగతి పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థి కత్తిపోట్లకు గురయ్యాడు.
విశాఖపట్నంలో రౌడీ గ్యాంగ్‌లు చెలరేగిపోతున్నాయి. దండు పాళ్యం సినిమాను చూసి అందులోని ముఠా ప్రేరణతో ప్రత్యేకంగా అదే పేరు పెట్టుకుని ఓ ముఠా హల్ చల్ చేస్తోంది. దాడులు, దౌర్జన్యాలకు దిగుతోంది. శుక్రవారం రోజు టెన్త్ పరీక్షలు రాసి వస్తున్న ఓ విద్యార్థిపై దండుపాళ్యం ముఠా దాడి చేసింది. కత్తితో హత్య చేయడానికి ప్రయత్నించింది. గాయపడిన విద్యార్థిని కోన అరవింద్ అనే వ్యక్తిగా గుర్తించారు. అతనికి 22 ఏళ్లు. చదువు మధ్యలో ఆగిపోవడంతో ఇటీవల పదో తరగతి పరీక్షలు రాయాలన్న పట్టుదలతో మరోసారి పరీక్షలు రాస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఏపీలో ఆ రెండు కార్పొరేషన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు గల్లంతు ? అసలేం జరిగింది ?
అరవింద్ క్వీన్ మేరీ స్కూల్‌లో పరీక్ష రాసి బయటకు వస్తున్న సమయంలో కోట వీధి జంక్షన్ దగ్గర దండు పాళ్యం ముఠా ఎదురయింది. వారిలో ఇద్దరు ఒక్క సారిగా అరవింద్‌పై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరు ధోని సతీష్ గా గుర్తించారు. దండు పాళ్యం గ్యాంగ్‌లో ఇతరని పేరు గసగసాలు అని పోలీసులు చెబుతున్నారు. గసగసాలను మత్తు ఇచ్చే పదార్థంగా మార్చుకుని సేవిస్తూ బీభత్సం సృష్టిస్తూంటాడు. అరవింద్‌పై దాడి చేసిన మరో వ్యక్తిని వాసుపల్లి చిన్నగా గుర్తించారు. దండు పాళ్యం గ్యాంగ్‌లో అతని పేరు ఎలక. ఎలకలా ప్రవర్తిస్తూంటాడని అతనికి ఆ పేరు పెట్టినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ప్రియుడి కండోమ్‌కు సీక్రెట్‌గా రంథ్రాలు చేసిన మహిళ, ఊహించని శిక్ష విధించిన కోర్టు!
సతీష్ అలియాస్ గసగసాలు, వాసుపల్లి చిన్న అలియస్ ఎలక దాడుల్లో గాయపడిన అరవింద్‌ను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అరవింద్‌తో పాత గొడవలు ఉన్నందున వారు దాడి చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రెల్లి వీధిలో వీరు పరస్పరం దాడులకు పాల్పడుతూంటారని పోలీసులు చెబుతున్నారు. అరవింద్‌పై దాడి చేసిన వారిలో వాసుపల్లి చిన్న అలియాస్ ఎలక అనే ముఠా సభ్యుడిపై రౌడీ షీట్ కూడా ఉంది. హత్యాయత్నం కేసులో నిందితుడు కూడా. గతంలో రెల్లివీధి, జాలారి పేట ఏరియా లో గొడవలు జరిగినవి. వాటి పరిణామాల కారణంగానే ఈ దాడి జరిగినట్లుగా భావిస్తున్నారు.
కొంత మంది యువకులు చిన్న తనంలో దారి తప్పి.. మత్తుకు బానిసలుగా మారి అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. ఈ క్రమంలో వివిధ రకాల పేర్లతో ముఠాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దండుపాళ్యం పేరుతో కూడా అలాంటి ముఠాలు ఏర్పాటు చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు.