Holes To Condoms: ప్రియుడి కండోమ్‌కు సీక్రెట్‌గా రంథ్రాలు చేసిన మహిళ, ఊహించని శిక్ష విధించిన కోర్టు!
ఓ మహిళ తన ప్రియుడి కండోమ్‌కు రంథ్రాలు చేసింది. ఆ తర్వాత ఊహించని చిక్కుల్లో పడింది. చివరికి జైల్లో ఊచలు లెక్కించే వరకు పరిస్థితి దిగజారింది.
సురక్షిత శృంగారం కోసం కండోమ్ తప్పనిసరి. కండోమ్ గర్భం రాకుండా అడ్డుకోవడమే కాకుండా లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది. అందుకే, చాలామంది మహిళల గర్భం రాకుండా ఉండేందుకు తమ పార్టనర్‌ను తప్పకుండా కండోమ్ ధరించాలని కోరుతారు. కానీ, ఈ మహిళ మాత్రం అందుకు విరుద్దంగా చేసింది. తన ప్రియుడి కండోమ్‌కు రంథ్రాలు చేసింది. ఆ తర్వాత అసలు విషయం చెప్పి షాక్ ఇవ్వాలని ప్రయత్నించింది. కానీ, అతడే ఆమెకు ఊహించని షాకిచ్చాడు. ఆమె చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు కూడా ఆమె పనిని తప్పుబట్టి చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.
ఈ ఘటన పశ్చిమ జర్మనీలోని బీలెఫెల్డ్‌లో చోటుచేసుకుంది. 39 ఏళ్ల మహిళ, 42 ఏళ్ల వ్యక్తితో గత ఏడాది నుంచి స్నేహం చేస్తోంది. ఆన్‌లైన్ పరిచయంతో వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. వీరిద్దరూ ‘ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్’గా ఉన్నారు. అంటే ప్రేమించుకోరు. కానీ, శరీరాక అవసరాల కోసం పడక సుఖం పొందుతారు. దీన్ని సహజ జీవనం అని కూడా అనరు. ‘ఫ్రెండ్స్ విత్ బెవిఫిట్స్’లో ఉన్నవారిని ప్రేమికులుగా కూడా వర్ణించరు. కాబట్టి, వీరిద్దరు పెళ్లి చేసుకొనే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే, ఆ మహిళకు మాత్రం తన స్నేహితుడిని పెళ్లి చేసుకోవాలని ఉండేది. కానీ, అతడు అందుకు సిద్ధంగా ఉండేవాడు కాదు.
ఈ నేపథ్యంలో ఆమె ఓ రోజు తన స్నేహితుడికి తెలియకుండా అతడు వాడే కండోమ్‌లకు రంథ్రాలు చేసింది. కొద్ది రోజుల తర్వాత ఆమె అతడికి వాట్సాప్‌లో షాకింగ్ న్యూస్ చెప్పింది. ‘‘నేను ఇప్పుడు గర్భవతిని. నేను ఉద్దేశపూర్వకంగానే నువ్వు వాడే కండోమ్‌లకు రంథ్రాలు చేశాను’’ అని మెసేజ్ చేసింది. దీంతో అతడికి నోటమాట రాలేదు. ఆమె చేతిలో మోసపోయాననే బాధతో కోర్టును ఆశ్రయించాడు. వాస్తవానికి ఆమె గర్భవతి కాలేదు. అతడి కండోమ్‌కు రంథ్రాలు చేసినా.. ఫలితం పొందలేదు. కానీ, అతడి మనసులో మాట తెలుసుకోవడం కోసం ఆమె ఆ మెసేజ్ చేసింది. కానీ, అతడు దాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు.
అతడు చేసిన నేరారోపణలను ఆ మహిళ అంగీకరించింది. గర్భవతిని కావాలనే ఉద్దేశంతోనే అతడి కండోమ్‌లకు రంథ్రాలు చేశానని అంగీకరించింది. ఈ కేసు విచారించిన కోర్టు కూడా ఆమె చేసింది నేరమేనని తేల్చింది. కానీ, ఆమెపై ఎలాంటి అభియోగాలు మోపాలి? ఏ శిక్ష విధించాలనే విషయంపై న్యాయ మూర్తి ఆస్ట్రిడ్ సాలెవ్స్కీ కూడా గందరగోళానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన దీన్ని ఓ చరిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. చిత్రం ఏమిటంటే ఆమెపై లైంగిక వేదింపుల అభియోగాలు దాఖలు చేస్తూ తీర్పును వెల్లడించారు.
Also read: షిగెల్లా బ్యాక్టిరియా వల్ల మనదేశంలో తొలి మరణం? జాగ్రత్త ఈ బ్యాక్టిరియా అంటువ్యాధి
సాధారణంగా పురుషుడు తమ భాగస్వామితో శృంగారం చేస్తూ మధ్యలో కండోమ్‌ను తొలగించి సెక్సులో పాల్గొంటే అక్కడి చట్టాలు శీలాన్ని దోచుకోవడం(stealthing)గా పరిగణిస్తాయి. అయితే, ఇక్కడ రివర్సులో అది జరిగింది. పురుషుడి కండోమ్‌కు మహిళే స్వయంగా రంథ్రాలు చేసి.. అతడికి తెలియకుండానే నేరానికి పురిగొల్పింది. కాబట్టి, ఆమెపై లైంగిక వేదింపుల కేసు దాఖలు చేయడమే కరెక్ట్ అని భావించింది. ఉద్దేశపూర్వకంగా కండోమ్‌లకు రంథ్రాలు చేసినందుకు ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు పేర్కొంది. ఇది జర్మనీలోనే చారిత్రాత్మక తీర్పు అని వెల్లడించారు.
Also read: మూడో బిడ్డను కంటే పదకొండున్నర లక్షల రూపాయల బోనస్, ఓ కంపెనీ బంపర్ ఆఫర్