By: ABP Desam | Updated at : 05 May 2022 03:13 PM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
చైనా ప్రభుత్వం దేశ జనాభాను పెంచుకునే పనిలో బిజీగా మారింది. రకరకాల ఆఫర్లను జంటలకు కల్పిస్తూ పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తోంది. 2016లో ఒక బిడ్డనే కనాలన్న పాలసీని రద్దు చేసింది. 1980లో దేశ జనాభాను నియంత్రించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. 2021లో ముగ్గురు పిల్లల్ని కనొచ్చనే పాలసీని ప్రవేశపెట్టింది. అయినా ఎవరూ ముగ్గురు పిల్లల్ని కనేందుకు ఎవరూ ఇష్టం చూపించడం లేదు. దీంతో రకరకాల ఆఫర్లు ఇస్తూ జంటలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రచారంలో కొన్ని చైనా కంపెనీలు కూడా పాల్గొంటున్నాయి. తాజాగా ఒక చైనా కంపెనీ రెండో సారి, మూడో సారి గర్భం ధరించి బిడ్డలను కనేవారికి బంపర్ ఆఫర్లు ప్రకటించింది.
డబ్బులు,సెలవులు...
చైనా రాజధాని బీజింగ్లో ఉన్న దబీనాంగ్ టెక్నాలజీ గ్రూప్ మూడో బిడ్డకు జన్మనిచ్చే ఉద్యోగికి 90,000 యువాన్ల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. అంటే మన రూపాల్లో పదకొండున్నర లక్షల రూపాయలు. అంతేకాకుండా మహిళా ఉద్యోగికైతే ఏడాది జీతంతో కూడిన సెలవు, అదే పురుష ఉద్యోగికైతే 9 నెలలు జీతంలో కూడిన సెలవు ఇస్తామని ప్రకటించింది. ఇక రెండో బిడ్డను కన్నవారికైతే రూ.7 లక్షలు, మొదటి బిడ్డను కన్నవారికైతే మూడున్నర లక్షల రూపాయలు ఆఫర్ చేస్తోంది. అలా దేశ జనాభాను పంచేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టు చెబుతోంది.
జనాభా పడిపోయింది
చైనాలో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గుతోంది. గత పదేళ్లలో వార్షిక జనాభా వృద్ధి రేటు 0.53%గా నమోదు అయింది. ఇలా జనాభా తగ్గడం వల్ల భవిష్యత్తులో ముసలి వారి సంఖ్య పెరుగుతుంది. యువత సంఖ్య తగ్గుతుంది. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసే అంశం. చైనాలో 16 నుంచి 59 మధ్య వయస్సులోని వారి సంఖ్య నాలుగు కోట్లు తగ్గడం ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది. 140 కోట్ల జనాభా ఉన్న చైనాలో ప్రస్తుతం పనిచేయగల సత్తా ఉన్న జనాభా 88 కోట్ల దాకా ఉంది.
ఒక బిడ్డ విధానానికి స్వస్తి పలికాక జననాల సంఖ్య పెరిగినట్టు గుర్తించారు అధికారులు. 2020లో 12 మిలియన్ల మంది శిశువులు జన్మించగా, 2021 మే చివరి నాటికి 14.65 మిలియన్ల మంది పిల్లలు జన్మించారు.
Also read: హైబీపీ, షుగర్ ఉందా? ఉల్లికాడలను వంటల్లో భాగం చేసుకోండి
Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!
Keema Recipe: దాబా స్టైల్లో కీమా కర్రీ రెసిపీ, తింటే ఎంతో బలం
Clay Pot: ఫ్రిజ్లో నీళ్ల కన్నా కుండలో నీళ్లు తాగడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?
Male Fertility: అబ్బాయిలు జర జాగ్రత్త, వీటిని తింటే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది
Choking: పొలమారితే ‘ఎవరో తలచుకోవడం’ కాదు, గొంతులో జరిగేది ఇది
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
PM Modi In ISB: 25 ఏళ్లకు వృద్ధి మ్యాప్ రెడీ- ఐఎస్బీ హైదరాబాద్‌లో ప్రధానమంత్రి మోదీ