అన్వేషించండి

world's Tallest Dog: వామ్మో ఈ కుక్కేంటి గ్రహాంతరవాసిలా ఇంతుంది? వీడియో చూడండి

ప్రపంచంలో అతి ఎత్తయిన కుక్కగా గిన్నిస్ రికార్డులకెక్కింది జ్యూస్.

జ్యూస్... ఓ శునకం అందమైన పేరు ఇది. ఇప్పుడు ఆ కుక్క ప్రపంచంలోన అతి ఎత్తయిన కుక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. చూస్తే భూమికి చెందిన జీవిలా కనిపించదు. అంతెత్తుగా గ్రహాంతరవాసిలా దర్శనమిస్తుంది. ఇది అమెరికన్ గ్రేట్ డేన్ జాతికి చెందిన  శునకం. మూడు అడుగుల అయిదు అంగుళాల ఎత్తు పెరిగింది. ప్రస్తుతం దీని వయసు రెండేళ్లే. ఇంకా పొడవు, ఎత్తు పెరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. టెక్సాస్ లోని బెడ్ ఫోర్డ్ ప్రాంతంలో నివసిస్తున్న బ్రిటనీ డేవిస్ కుటుంబం జ్యూస్ ను పెంచుకుంటోంది. చిన్నప్పట్నించి గ్రేట్ డేన్ జాతికి చెందిన కుక్కను పెంచుకోవాలని కోరిక అని జ్యూస్ తో ఆ కోరిక తీరిందని చెబుతోంది బ్రిటనీ. 

పుట్టినప్పట్నించే అన్ని శునకాలతో పోలిస్తే జ్యూస్ కాస్త పెద్దగా ఉండేదంట. జ్యూస్ తల్లికి అయిదు పిల్లలు ఒకే కాన్పులో జన్మిస్తే, వాటన్నింటిలో పెద్దగా పుట్టింది జ్యూస్. ఈ శునకానికి పందులన్నా, వర్షమన్నా చాలా భయం. ప్రపంచంలోనే జ్యూస్ అతి ఎత్తయిన కుక్క అవుతాడని ఎప్పుడూ అనుకోలేదని, ఓసారి సరదాగా కొలిచామని చెప్పుకొచ్చింది. ప్రపంచంలోనే అతి ఎత్తయిన కుక్కను కలిగి ఉంటామని ఎప్పుడూ ఊహించలేదంటూ ఆనందపడుతోంది బ్రిటనీ. చాలా వేగంగా పరుగెత్తగలడం ఈ శునకం స్పెషాలిటీ. ఆ ప్రాంతంలో జ్యూస్ ఒక సెలెబ్రిటీ. స్థానిక రైతు బజార్లలో షికార్లు చేయడానికి వెళుతుంది. కిటికీ పక్కన పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఆస్వాదిస్తుంది. 

గతంలో కూడా గ్రేట్ డేన్ జాతికి చెందిన కుక్కే ఎత్తయినదిగా రికార్డులకెక్కింది. విచిత్రంగా దాని పేరు కూడా జ్యూస్. కానీ అది 2014లో మరణించింది. 

View this post on Instagram
 
A post shared by Guinness World Records (@guinnessworldrecords)

Also read: షిగెల్లా బ్యాక్టిరియా వల్ల మనదేశంలో తొలి మరణం? జాగ్రత్త ఈ బ్యాక్టిరియా అంటువ్యాధి

Also read: అప్పట్లో తినే ముందు మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టేవారు, ఎందుకు? సైన్సు ఏం చెబుతోంది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Embed widget