(Source: ECI/ABP News/ABP Majha)
Mangoes: అప్పట్లో తినే ముందు మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టేవారు, ఎందుకు? సైన్సు ఏం చెబుతోంది?
మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. పండ్లను తినే ముందు వాటిని నీటిలో నానబెట్టడం ఎంత ముఖ్యమో తెలుసా?
వేసవి వచ్చిందంటే మార్కెట్లో మామిడి పండ్లు సందడి చేస్తాయి. ఎంతోమంది ఫేవరేట్ పండ్లు మామిడే. వాటిలో ఉండే పోషకాలు కూడా తక్కువేం కాదు. సీజనల్‌గా దొరికే ఈ పండును కచ్చితంగా తినమని వైద్యులు సూచిస్తారు. ఇప్పుడు అందరూ మామిడి పండ్లను ఓసారి కడిగి తినేస్తున్నారు. కానీ అమ్మమ్మల కాలంలో కచ్చితంగా మామిడి పండ్లను తినే ముందు నీటిలో కాసేపు నానబెట్టి, ఆ తరువాత బాగా కడిగి తింటారు. దానికి కారణం పండ్లపై పడ్డ దుమ్మూ ధూళి, రసాయనాలు పోగొట్టడానికే. నిజానికి అలా నానబెట్టి తినడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సైన్సు కూడా ఈ కారణాలను సమర్థిస్తోంది. మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టాకే తినమని సిఫారసు చేస్తోంది.
ఆ యాసిడ్ పోయేలా...
ఫైటిక్ యాసిడ్ మామిడిపండ్లలో ఉంటుంది.యాంటీ న్యూట్రియంట్ గా చెప్పుకునే ఫైటిక్ యాసిడ్ మన శరీరంలో చేరితే ఇనుము, జింక్, కాల్షియం, మినరల్స్ వంటి పోషకాలను అవయవాలు గ్రహించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల పోషకాహారలోపం ఏర్పడవచ్చు. మామిడి పండ్లను తినేముందు నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ ను తొలగిస్తుంది. ఇది కేవలం మామిడి పండ్లలోనే కాదు అనేక పండ్లు, కూరగాయలు, నట్స్ లలో కూడా ఉంటుంది.
మొటిమలు రాకుండా...
మామిడి పండ్లను కాసేపు నానబెట్టి తినడం వల్ల వాటిలో ఉన్న వేడి తొలగిపోతుంది. డయేరియా వంటి దుష్ప్రభావాలు రాకుండా ఉంటాయి. మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది. తలనొప్పి, మలబద్ధకం, పేగు సంబంధిత సమస్యలు, చర్మ సమస్యలు వంటి వాటిని నివారిస్తుంది.
పురుగు మందులుండొచ్చు...
పంటను కాపాడుకోవడానికి రకరకాల పురుగు మందులను చల్లుతుంటారు. అవన్నీ మామిడి పండ్ల ఉపరితలంపై ఉండిపోతాయి. పదినిమిషాలు నానబెట్టడం వల్ల ఉపరితలంపై ఉన్న పురుగు మందుల అవశేషాలు పోతాయి. ఆ పురుగు మందులు ఒంట్లో చేరితే శ్వాసకోశ సమస్యలు, అలెర్జీ, తలనొప్పి, కళ్లు మంట, చర్మం సమస్యలు, వికారం వంటివి కలగవచ్చు.
వేడి పోయేలా...
మామిడి కాయల్లో వేడి చేసే గుణం ఉంటుంది. ఈ గుణం వాటికి థర్మోజెనిసిస్ వల్ల కలుగుతుంది. పండుు కాసేపు నానబెట్టడం వల్ల పండ్లలోని థర్మోజెనిక్ లక్షణాలు తగ్గుతాయి. ఫలితంగా వాటిని తిన్నా కూడా శరీరానికి వేడి చేయదు.
కొవ్వును కరిగిస్తాయి
మామిడి పండ్లలో ఫైటో కెమికల్స్ ఉంటాయి. మామిడి పండ్లను నానబెట్టడం వల్ల అవి సహజమైన ఫ్యాట్ బస్టర్స్ గా పనిచేస్తాయి. ఈ మామిడి పండ్లను తిన్నా కూడా శరీరంలో కొవ్వు చేరదు.
Read Also: ఆ తెగలో విచిత్రమైన ఆచారం, అమ్మాయి పుడితే వేశ్యగా మారుస్తారు
Also read: కరోనా వచ్చి తగ్గిన వారిలో కొనసాగుతున్న లాంగ్ కోవిడ్, ఈ లక్షణాలు ఉంటే లాంగ్ కోవిడే