By: ABP Desam | Updated at : 05 May 2022 07:38 PM (IST)
బిచ్చగాడితో గొడవ పెట్టుకుని కొట్టి చంపిన సైకోలు
గుంటూరు శివారులో అంకిరెడ్డిపాలెం డొంకరోడ్డులో మూడు రోజుల కిందట ఓ బిచ్చగాడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు హత్యకేసును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలు బిచ్చగాడిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? బిచ్చగాడు ఎవరితో గొడవపడతాడు? గొడవ పడినా బిచ్చగాడు అని వదిలేయకుండా ప్రాణం తీస్తారా ? అని పోలీసులు అనేక రకాలుగా ఆలోచించారు. ఈ కేసులో ఏదో మిస్టరీ ఉందనుకున్నారు. అందుకే బిచ్చగాడి ప్రాణమే కదా అని వదిలి పెట్టలేదు.. హత్య మిస్టరీని తేల్చాలనుకున్నారు..సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేశారు. దర్యాప్తులో కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి.
కుమార్తె లవర్ హత్యకు సుపారీ ! ఆ తండ్రి స్కెచ్ ఎంత వయోలెంట్ అంటే ?
దగ్గర్లోని సీసీ కెమెరాలు ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాత ముగ్గురు యువకుల మీద అనుమానం వచ్చింది. వారు ఊళ్లో అల్లరి చిల్లరగా తిరుగుతూ.. మద్యం మత్తులో ఇతరులపై దాడులు చేస్తూ ఉంటారని తేలింది. హత్య జరిగిన రోజున వారు అ ప్రాంతంలోనే తచ్చాడినట్లుగా ఆధారాలు లభించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్ ఇవ్వడంతో ముగ్గురూ అసలు విషయాన్ని చెప్పేశారు. ఆ బిచ్చగాడ్ని తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. ఎందుకు హత్య చేశారు అంటే.. వారు చెప్పిన కారణం పోలీసులను కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. వారు మద్యం మత్తులో ఉన్నారు.. సైకోల్లా మారిపోయారు. ఎవడో ఒక అమాయకుడు కనిపిస్తే గొడవ పెట్టుకుని కొట్టాలనుకున్నారు. వారి కి ఆ బిచ్చగాడు కనిపించాడు. దాంతో ఆ బిచ్చగాడిపై దాడికి పాల్పడ్డారు.
ఒకే దెబ్బకు అప్పు, భర్త రెండూ ఫినిష్ - ప్రియుడి మోజులో భార్య మాస్టర్ ప్లాన్!
మద్యం మత్తులో తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో చచ్చేదాకా కొట్టారు. రాళ్లు, కర్రలతో క్రూరంగా చంపారు. ఆ తర్వాత తమను ఎవరూ చూడలేదనుకుని ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. తాము చంపింది కూడా బిచ్చగాడినే కాబట్టి ఎవరూ పట్టించుకోరని అనుకున్నారు. కానీ పోలీసులు అలా అనుకోలేదు. బిచ్చగాడినే చంపిన సైకోలు.., తర్వాత ఇంకెంత మంది ప్రాణాలకు ముప్పు తెస్తారోనని సీరియస్‌గా దర్యాప్తు చేశారు. నిందితుల్ని పట్టుకున్నారు.
జూమ్ కారులో గంజాయి రవాణా, స్మగ్లర్ల ఎత్తును చిత్తు చేసిన పోలీసులు
మద్యం మత్తులో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న సైకోలు అంతటా పెరిగిపోతున్నారు. వీరిని కట్టడి చేయాడనికి పోలీసులు ప్రత్యేకమైన జాగ్రత్లు తీసుకోవాల్సి ఉంది. లేకపోతే వారి సైకో యిజానికి మరింత మంది ప్రాణాలు బలయ్యే ప్రమాదం ఉంది.
Karimnagar: ఇంటి కింద 4 కోట్లు! వాటి కోసం క్షద్రపూజలు, తెలివిగా నమ్మించి బురిడీ కొట్టించిన దొంగ బాబాలు
Rajanna Sircilla: కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్లు - ట్విస్ట్ ఏంటంటే !
Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!
UP News: వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం- 8 మంది మృతి
Kakinada News : డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగిస్తున్న ఉచ్చు, పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజాలు!
TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
Vitamin Deficiency: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్