అన్వేషించండి

Anantapur Crime : ఒకే దెబ్బకు అప్పు, భర్త రెండూ ఫినిష్ - ప్రియుడి మోజులో భార్య మాస్టర్ ప్లాన్!

Anantapur Crime : వివాహేతర సంబంధం మరో ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో అన్న, అల్లుడి సాయంతో భర్తను హత్య చేయించింది మహిళ. ధర్మవరంలో ఈ కేసు సంచలనం అయింది.

Anantapur Crime :వివాహేతర సంబంధాలతో కుటుంబాలు కుప్పకూలుతూనే ఉన్నాయి. ఇటీవల ధర్మవరంలో ఏప్రిల్ ఎనిమిదో తేదీన గంగాధర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. దీనిని కాల్ మనీ హత్యగా అందరూ భావించారు. గంగాధర్ ను వడ్డీ వ్యాపారులు హత్య చేశారంటూ భార్య పల్లపు లక్ష్మిదేవీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇది కాల్ మనీ మర్డర్ అంటూ ధర్మవరంలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు కూడా అదే కోణంలో విచారణ మొదలుపెట్టారు. కానీ పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈ హత్యకు కాల్ మనీకు సంబంధం లేదని తేల్చారు. భార్యే ఇంతటి దారుణానికి పాల్పడిందన్న నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా అంతకన్నా దారుణం ఏంటంటే ఈ హత్యకు నిందితురాలి అన్న, అల్లుడు పాల్పడిన షాకింగ్ విషయాలు దర్యాప్తులో వెల్లడయ్యాయి. 

ఏం జరిగిందంటే? 

అనంతపురం జిల్లా ధర్మవరంలో పల్లపు లక్ష్మిదేవి, గంగాధర్ కుటుంబం ఉండేది. గంగాధర్ వడ్డీ వ్యాపారుల వద్ద దాదాపుగా ఎనిమిది లక్షల రూపాయలు అప్పులు చేశాడు. ఈ అప్పుల్నే అతడి భార్య హత్యకు కారణంగా వాడుకుంది. అతడి భార్య లక్ష్మిదేవి ధర్మవరంలోని తారకరామాపురానికి చెందిన భాస్కర్ రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో భార్య లక్ష్మిదేవి దారుణమైన పన్నాగం పన్నింది. హత్య చేసి వడ్డీ వ్యాపారుల ఖాతాలోకి వేస్తే అప్పుకు అప్పు, అడ్డుగా ఉన్న భర్త ఇద్దరి పీడ విరగడ అవుతుందని ప్లాన్ చేసింది. అనుకున్నదే తడువుగా తన అన్న గొడ్డెండ్ల వెంకటేష్, అల్లుడు(కూతురి భర్త) బండారు సుధాకర్ తో మాట్లాడింది. ఈ హత్య చేసేందుకు సుపారీ కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో నిందితులు ఏప్రిల్ ఎనిమిదో తేదీన ధర్మవరంలోని ఎల్పీ కూడలి వద్ద ఉన్న రైల్వే పార్క్ లో గంగాధర్ ను  దారుణంగా హత్య చేసి పరారయ్యారు. 

కాల్ మనీ హత్యగా క్రియేట్ 

ఈ కేసులో మృతుడి భార్య పోలీసులను తప్పుదోవ పట్టించింది. తన భర్తను వడ్డీవ్యాపారులే హత్య చేశారని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. అప్పటికే ధర్మవరంలో ఇలాంటి ఘటనలు జరగడంతో మీడియా కూడా పోలీసుల వైఫల్యాలను ప్రశ్నించింది. దీంతో సీరియస్ గా తీసుకున్న పోలీసులకు విచారణలో నిందితురాలు లక్ష్మిదేవికి ఉన్న అక్రమ సంబంధం, సాంకేతికత ఆధారంగా ఫోన్ డేటాను విశ్లేషించిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేసేసరికి నిందితులు తాము చేసిన దారుణాన్ని ఒప్పుకొన్నారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో కట్టుకున్న భార్య, ఆమె కుటుంబ సభ్యులు హత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సంచలనంగా మారిన కేసులో పోలీసులు వ్యూహాత్మకంగా సాంకేతికతను ఉపయోగించి ఛేదించడంతో ధర్మవరం పోలీసులను అభినందించారు సత్యసాయి జిల్లాఎస్పీ రాహుల్ దేవ్ సింగ్. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Embed widget