అన్వేషించండి

Zoom Car Ganja : జూమ్ కారులో గంజాయి రవాణా, స్మగ్లర్ల ఎత్తును చిత్తు చేసిన పోలీసులు

Zoom Car Ganja : గంజాయి రవాణాకు స్మగ్లర్లు కొత్త ఎత్తు వేశారు. జూమ్ యాప్ లో కారు బుక్ చేసి సీక్రెట్ గా విశాఖ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. పక్కా సమాచారంలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Zoom Car Ganja : జూమ్ కారులో గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విషయాలను బాలానగర్ డీసీపీ సందీప్ వెల్లడించారు. జగద్గిరిగుట్ట పరిధి మహదేవపురంలో హ్యూందాయ్ వెన్యూ కారులో గంజాయి తరలిస్తునారన్న పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. పోలీసులు కారును తనిఖీలు చేస్తే 104 కేజీల గంజాయి పట్టుబడింది. నలుగురు నిందితులు ఆశిష్ కుమార్(35), కొర్ర రవి(25), కొర్ర శ్రీను(20), నాగేశ్వరరావు(52) లను అరెస్టు చేశారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర యావత్ మాల్ ప్రాంతానికి గంజాయి తరలిస్తుంటారని డీసీపీ తెలిపారు. నిందితులు జూమ్ యాప్ ద్వారా కారు బుక్ చేసుకుని గంజాయి సరఫరా చేస్తుంటారని తెలిపారు. 15 లక్షల విలువైన గంజాయి, కారు, 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి మొత్తం విలువ రూ.35 లక్షల ఉంటుందన్నారు. నిందితులు సరికొత్త వ్యుహంతో జూమ్ యాప్ ద్వారా కార్లను, బైక్ లను బుక్ చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు పోలీసులకు సవాలుగా మారుతున్నారని డీసీపీ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించామని తెలిపారు.  Zoom Car Ganja : జూమ్ కారులో గంజాయి రవాణా, స్మగ్లర్ల ఎత్తును చిత్తు చేసిన పోలీసులు

గంజాయి రవాణాను పట్టించిన రోడ్డు ప్రమాదం

జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం స్మగ్లింగ్ ను బయటపెట్టింది. గంజాయి రవాణా చేస్తున్న యువకుడు ఈ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రాంతానికి చెందిన వెంకటేశ్‌, వినయ్‌, జాన్‌, మహేశ్ ​లు విశాఖ నుంచి గంజాయి రవాణా చేస్తున్నారు. విశాఖ నుంచి రెండు ద్విచక్ర వాహనాలపై గంజాయి సంచితో హైదరాబాద్‌ వస్తున్నారు. నెల్లుట్ల వంతెన వద్ద జనగామ నుంచి సూర్యాపేట వైపు వెళ్తోన్న కారును బైక్ ఢీకొట్టింది. ఇది గ‌మ‌నించిన స్థానికులు అత‌న్ని లేపి కొన్ని మంచినీళ్లు తాగించారు. అనంత‌రం అత‌న్ని ప‌రిశీలిస్తే సంచిలోని గంజాయి ఉందని గుర్తించారు. 

మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు 

దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. నిందితుడి వ‌ద్ద నుంచి సుమారు 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక‌ ఎస్సై రఘుపతి వెల్లడించారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఇతర విషయాలపై విచార‌ణ జ‌రుపుతున్నట్టు ఎస్సై వివ‌రించారు. త‌న‌తోపాటు ఉన్న మ‌రో ముగ్గురు ద్విచక్ర వాహనంపై పారిపోయారని పోలీసులు తెలిపారు. త‌న బైక్‌ స్టార్ట్‌ కాకపోవడంతో తాను అక్కడే ఉండిపోయానని నిందితుడు మహేశ్​ అంగీక‌రించిన‌ట్టు ఎస్సై తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget