By: ABP Desam | Updated at : 10 May 2022 11:02 PM (IST)
Edited By: Murali Krishna
గురకతో వ్యభిచార ముఠా గుట్టు రట్టు! అక్కడ ఇంత కథ ఉందా?
Karnataka News: ఈ మధ్య కాలంలో నేరాలు చేసేవారు టెక్నాలజీని, తెలివితేటల్ని తెగ వాడేస్తున్నారు. వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు కూడా తెగ కష్టపడాల్సి వస్తుంది. తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఘటనే జరిగింది. టాయిలెట్‌లో ఓ రహస్య గది ఏర్పాటు చేసుకుని వ్యభిచారం సాగిస్తోన్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. అయితే ఈ ముఠా పట్టుబడటానికి కారణమేంటో తెలుసా? గురక.. అవును మీరు చదివింది నిజమే. అసలు ఏం జరిగిందంటే?
ఇదేం ఐడియారా బాబు!
కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. చిత్రదుర్గలోని ఓ చోట వ్యభిచారం చేస్తున్నట్లు పక్కా సమాచారం అందుకుని స్పెషల్ టీం రైడ్‌కు వెళ్లింది. అయితే ఆ సమయంలో హోటల్ మొత్తం జల్లెడ పట్టినా పోలీసులకు ఏం కనిపించలేదు. దీంతో పోలీసులు గదులతో పాటు బాత్‌రూంలను కూడా పరిశీలించారు. అక్కడే అసలు విషయం బయటపడింది. బాత్రూంను పరిశీలిస్తోన్న సమంయలో అక్కడ నుంచి ఓ గురక శబ్దం వినిపించింది.
దీంతో పోలీసులు శబ్ధం ఎటువైపు వస్తుందోనని పరిశీలించారు. టైల్స్ నుంచి గురక రావడం వినిపించి.. అనుమానంతో ఆయన టైల్స్‌పై చెయ్యి వేయగానే అది కాస్త పక్కకు జరిగింది. దీంతో లోపల ఏర్పాటు చేసిన ఒక చిన్న గది బయటపడింది.
A prostitution racket run through a secret hideout built inside a toilet by a hotel was busted by #Chitradurga #Karnataka police.Three people arrested by cops. pic.twitter.com/XYegO1JBOJ
— Imran Khan (@KeypadGuerilla) May 7, 2022
లోపలే వ్యభిచారం
పోలీసులు గదిని తెరిచి చూడగా అందులో ఒక చిన్న సెల్లార్ ఉండటం గుర్తించారు. అలా మొత్తం మూడు వ్యభిచార గృహాలు, ఒక క్లయింట్, ఒక బ్రోకర్ ఇందులో పట్టుబడ్డారు. బయట చూడ్డానికి మామూలు ప్రదేశమే అనిపించినా టాయిలెట్ లోపల ఇలా వ్యభిచార గృహం ఉండడం పోలీసులనే షాక్‌కు గురయ్యేలా చేసింది. పోలీసులు తీసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read: Param Vishisht Seva Medal: ఆర్మీ చీఫ్‌కు రాష్ట్రపతి చేతుల మీదుగా పరమ విశిష్ట సేవా పురస్కారం
Also Read: SC on Sedition Law: రాజద్రోహం కేసులపై కేంద్రానికి సుప్రీం 24 గంటల డెడ్‌లైన్
Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ
మణిపూర్ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం
ఆన్‌లైన్‌లో మెక్సికన్ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్
Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో
Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>