Nandigama Murder : భర్త దగ్గర పనిచేస్తున్న వ్యక్తితో వివాహేతర సంబంధం, చివరకు భర్త ప్రాణం తీసింది!
Nandigama Murder : నందిగామ ఎక్సైజ్ కాలనీలో ఈ నెల 6 జరిగిన హత్యను పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు. భార్యే భర్త మర్డర్ కు ప్లాన్ చేసినట్లు నిర్థారించారు.
Nandigama Murder : వివాహేతర సంబంధాల కాపురాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. భర్త దగ్గర పనిచేసే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, చివరకు భర్త మర్డర్ కు ప్లాన్ చేసింది.
నందిగామ ఎక్సైజ్ కాలనీ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మేకల శివకుమార్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే తాపీ మేస్త్రి శివ కుమార్ ను వేముల అంకమ్మరావు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు మృతుడి భార్య మాధవి కూడా సహకరించిందని పోలీసులు వివరించారు. ఈ నెల ఆరో తేదీన ఎక్సైజ్ ఆఫీస్ సమీపంలో తాపీ మేస్త్రి శివకుమార్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. శివ కుమార్ భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బి.సి.కాలనీకి చెందిన వేముల అంకమ్మరావు, యాదవ బజారుకు చెందిన ఉప్పుతోళ్ళ గోవర్ధన్ రావు కలసి ఈ హత్య చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో శివకుమార్ భార్యతో వివాహేతర సంబంధం కలిగిఉన్న అంకమ్మ రావు ప్రధాన ముద్దాయి కాగా, మృతుడి భార్య మూడో ముద్దాయని పోలీసులు తేల్చారు. ఈ కేసు వివరాలను నందిగామ పోలీసులు మీడియాకు వివరించారు. ఇరువురు ముద్దాయిలను మీడియా ముందు హాజరుపరిచారు.
దర్యాప్తులో షాకింగ్ విషయాలు
ఇటీవల నందిగామలో జరిగిన శివ కుమార్ హత్య కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఈనెల 6వ తేదీన శివకూమర్ హత్యకు గురయ్యాడు. ఈ కేసును విచారించిన పోలీసులు ప్రియుడితో కలిసి భర్తను భార్యే హత్య చేయించినట్లు గుర్తించారు. శివకుమార్ దగ్గర పనిచేసే ఇద్దరు వ్యక్తులే అతడిని హత్య చేశారు. శివ కుమార్ వద్ద పనిచేసే వేముల అంకమ్మరావుతో మృతుని భార్యకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శివ కుమార్ హత్య అనంతరం అంకమ్మరావు మృతుని భార్యతో ఫోన్ లో మాట్లాడాడు. మృతుని భార్యతో అంకమ్మరావుకు ఉన్న అక్రమ సంబంధం కారణంగానే హత్య జరిగినట్టు పోలీసులు నిర్థారించారు. హత్య అనంతరం పర్సు, హత్యకు వాడిన ఆయుధాలను అంకమ్మరావు అత్త దగ్ధం చేసింది. నిందితులు వేముల అంకమ్మరావు, గోవర్ధనరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Also Read : Gun In Nellore : రెండు ప్రాణాలు తీసిన ఆ గన్ ఎక్కడిది..? నెల్లూరు ఎలా వచ్చింది..?