By: ABP Desam | Updated at : 09 May 2022 05:32 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
నిమిషం వ్యవధిలో రెండు ప్రాణాలు తీసింది ఆ తుపాకి. కనీసం తుపాకీతో పరిచయం లేని వ్యక్తి చేతుల్లో రెండుసార్లు అది పక్కాగా పేలింది. ఇంతకీ ఆ గన్ ఎక్కడిది..? ఎలా వచ్చింది..?
బాధితురాలు చనిపోయింది, హంతకుడు కూడా తనని తాను కాల్చుకుని చనిపోయాడు. ఇక కేసు క్లోజ్ అనుకుంటున్న క్రమంలో హంతకుడు వాడిన తుపాకీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎంక్వయిరీ అంతా ఇప్పుడీ తుపాకీ చుట్టూ తిరుగుతోంది.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో జరిగిన హత్య, ఆత్మహత్య.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇటీవల ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు పెచ్చుమీరిపోతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ హత్య, ఆత్మహత్య మరింత కలకలం రేపాయి. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో ఆమెను హత్య చేయడమే కాకుండా.. ఆ యువకుడు తనకు తాను కాల్చి చంపుకోవడం దారుణం. ఈ దారుణ ఘటనతో తాటిపర్తి గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకి మోత విన్నవాళ్లంతా హడలిపోయారు.
ఆ తుపాకి ఎక్కడిది..?
బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేసే సురేష్ రెడ్డికి తుపాకీతో పరిచయం లేదు. కానీ ప్రేమించిన అమ్మాయి కావ్య తనతో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో అతడు రాక్షసుడిలా మారాడు. తనకు దక్కని కావ్య ఇంకెవరికీ దక్కడం ఇష్టపడని సురేష్ రెడ్డి ఆమెను చంపడానికి నిశ్చయించుకున్నాడు. అయితే ఎలా..? చంపడం అంత ఈజీ కాదు, కానీ చంపేంత కోపం ఉంది. ఈ క్రమంలో అతను ఎలాగోలా ఓ తుపాకీ సంపాదించాడు. నెల్లూరు జిల్లాలో గన్ కల్చర్ ఉన్న ఆనవాళ్లు ఇప్పటి వరకూ లేవు. దీంతో అతను కచ్చితంగా బెంగళూరు నుంచే తుపాకీ వెంట తెచ్చుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.
లైసెన్స్ డ్ గన్ కాదు..
సురేష్ రెడ్డి తీసుకొచ్చిన గన్ లైసెన్స్ డ్ రివాల్వర్ కాదని తేలింది. అంటే అది స్నేహితుల వద్దో, లేదా తెలిసినవారి దగ్గరో తీసుకుంది కాదు. మాఫియా ముఠాల దగ్గర నుంచి సేకరించిన రివాల్వర్. హత్య చేసిన సురేష్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసులో ఇక ప్రధాన ముద్దాయి ఎవరూ లేరు. అయితే ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్ అంతా గన్ చుట్టూ తిరుగుతోంది. ఆ గన్ ని సురేష్ రెడ్డి ఎక్కడినుంచి తెచ్చాడు, అంత సులువుగా ఎలా కాల్చాడు అనే విషయాలపై కూపీ లాగుతున్నారు.
ఇద్దరు మంత్రులు జిల్లాలో ఉండగా..
స్థానిక మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, జిల్లా ఇన్ చార్జి మంత్రి అంబటి రాంబాబు ఇద్దరూ నెల్లూరు జిల్లాలోనే ఉన్నారు. పెన్నా, సంగం బ్యారేజీల పరిశీలనకు వచ్చిన అంబటి రాంబాబు.. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం మంత్రుల పర్యటన బందోబస్తులో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈ ఘటన జరిగింది. సమీక్షలో ఉన్న జిల్లా మంత్రి కాకాణి దృష్టికి ఎస్పీ ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే ఆయన ఆ విషయంపై దృష్టి సారించాలని వారికి సూచించారు. దీంతో ఎస్పీ హుటాహుటిన సమీక్షనుంచి బయటకొచ్చి స్థానిక అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు.
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !
Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
Nellore Wonder Kid: అక్షరాలతో ఆటలు, మ్యాథ్స్ తో గేమ్స్ - ఈ నెల్లూరు బాలిక సూపర్ అంతే
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?