Nizamabad Rape Case : చేసేది పోలీస్ ఉద్యోగం- చేసింది కూతురిపై అత్యాచారం ! ఇతనికేంటి శిక్ష ?
మతి స్థిమితం లేని సోదరుడి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిజామాబాద్ కానిస్టేబుల్.
![Nizamabad Rape Case : చేసేది పోలీస్ ఉద్యోగం- చేసింది కూతురిపై అత్యాచారం ! ఇతనికేంటి శిక్ష ? Nizamabad constable who raped the daughter of brother Nizamabad Rape Case : చేసేది పోలీస్ ఉద్యోగం- చేసింది కూతురిపై అత్యాచారం ! ఇతనికేంటి శిక్ష ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/25/9de984758b84eb6552fc51078fbadd34_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆయన చేసేది పోలీస్ ఉద్యోగం ( POLICE ) . తప్పొప్పులు ఏమిటో అందరికీ చెప్పాల్సిన ఉద్యోగం. ఆయనను చూస్తే తప్పు చేసేవాళ్లు కూడా భయడాల్సిన ఉద్యోగం. అలాంటి వ్యక్తి దారి తప్పాడు. అది కూడా ఎవరూ చేయలేనంత.. చేయడానికి కూడా ఆలోచన రానంత ఘోర తప్పిదం చేశాడు. తమ్ముడి కుమార్తెపై అత్యాచారానికి ( Police Rape Case ) పాల్పడ్డాడు. ఆ పిల్లకు మంచేదో..చెడేదో తెలియదు.మెదడు పూర్తిగా ఎదగలేదు. ఇలాంటి పరిస్థితిని ఆసరాగా చేసుకుని లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. ఇప్పుడా బాలిక గర్భం దాల్చింది. ఎనిమిదో నెల కావడతో విషయం బయటపడింది. ఆ పోలీసు చేసిన నికృష్టం వెలుగులోకి వచ్చింది.
గుంటూరు మహిళ మర్డర్ కేసులో ట్విస్టు- అత్యాచారం చేసి చంపేశారని భర్త ఆరోపణ
నిజామాబాద్‌కు ( Nizamabad ) చెందిన చంద్రకాంత్ ఏ ఆర్ కానిస్టేబుల్‌గా ( AR Conistable ) పని చేస్తున్నాడు. అతని సోదరుడు , మరదలు కొన్నాళ్ల కింద చనిపోయారు. వారి కూతురు ఎవరూ లేని అనాథ కావడంతో తాను చూసుకుంటానని ఇంటికి తీసుకు వచ్చాడు. కానీ అతనిది దుర్భుద్ది. ఆ అమ్మాయికి మతిస్థిమితం లేకపోవడంతో లైంగిక వాంఛలు ( Sexuval Harasment ) తీర్చుకోవాలనుకున్నాడు. మరో వ్యక్తితో కలిసి బాలికపై కొన్ని నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. కూతురితో సమానంగా చూసుకోవాల్సిన వ్యక్తి వావివరుసలు మరిచి ఆమె జీవితాన్ని కాలరాశాడు. ఏ ఆర్ కానిస్టేబుల్ చంద్రకాంత్‌ను పోలీసులు అరెస్ట్ ( Conistable Arrest ) చేశారు. అతడు నేరాన్ని ఒప్పుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.
కాపాడాల్సిన కంటి పాపే .. కాటేసిన చందంగా ఉన్న ఈ వ్యవహారం నిజామాబాద్‌లోనే కాదు తెలంగాణ ( Telangana ) మొత్తం కలకలం రేపంది. బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగంలో ఉండి ఇలాంటి పని చేసిన చంద్రకాంత్‌ను తక్షణం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి. కఠినశిక్ష విధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చంద్రకాంత్‌ను అరెస్ట్ చేసి .. పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో కొంత మంది మహిళలు ఆయనపై దాడికి ( Attack ) పాల్పడ్డారు. సమాజంలో పడిపోతున్న విలువలకు ఇలాంటి కేసులే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేరాలపై కఠినంగా వ్యవహరించాలన్న డిమాండ్లు అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)