Mumbai IT Raids : గోడల్లో వెండి..రహస్య అరల్లో నోట్ల కట్టలు ! ఈ రోజుల్లోనూ సినిమా టెక్నిక్కే ఫాలో అయ్యాడు.. అడ్డంగా బుక్కయ్యాడు !

అక్రమంగా సంపాదించేవారు ఎప్పుడో తెలివి మీరిపోయారు. కానీ ముంబైకి చెందిన చాముండా అనే వ్యాపారి మాత్రం పాత సినిమాల తరహా ఆలోచనలు చేయడంతో అడ్డంగా దొరికిపోయారు.

FOLLOW US: 

అక్రమ సంపాదనను పరుపుల కింద పెట్టడం.. గోడల్లో కనిపించకుండా ఉండేలా అరలు ఏర్పాటు చేసి అందులో పెట్టుకోవడం.. ఫ్లోరింగ్ టైల్స్ కింద ఎవరికి అనుమానం రాకుండా అరలు ఏర్పాటు చేసుకుని నోట్ల కట్టలు పెట్టడం ఎప్పటి ట్రెండ్ ? బ్లాక్ అండ్ వైట్ సినిమాల నాటి ఆలోచనలు అవి. ఇప్పుడు కూడా అవే ఫాలో అయితే దొరికిపోకుండా ఉంటారా? ఓ ముంబై వ్యాపారి * Mumbai Business Man )  అక్రమ సంపాదనలో ఎవరూ ఊహించనన్ని తెలివి తేటలు చూపించారు కానీ.. వాటిని దాచుకోవడంలో మాత్రం జీరో బుర్ర ఉపయోగించాడు. ఫలితంగా సంపాదించినదంతా ఐటీ అధికారుల పాలయింది. 

కడుపులో 79 కొకైన్ క్యాప్యూల్స్, వీడొక్కడే మూవీ సీన్ రిపీట్

ముంబై జవేరి బజార్‌లో చాముండా అనే బులియన్ ( Chamunda Bullion ) వ్యాపారి ఉన్నారు. ఆయన  లావాదేవీలన్నీ పన్నులు ఎలా ఎగ్గొట్టాలా అనే కోణంలోనే సాగుతాయి. మూడేళ్లలోనే  చాముండా బులియన్‌ టర్నోవర్‌ రూ.23 లక్షల నుంచి రూ.1,764 కోట్లకు పెరిగాయి. కానీ జీఎస్టీ మాత్రం దానికి తగ్గట్లుగా కట్టలేదు.  జీఎస్టీ అధికారులకు ( GST ) అనుమానం వచ్చి ఆయన కార్యాలయం లో సోదాలు చేశారు.  మూడు ప్రాంతాల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయాలపై   దాడులు నిర్వహించారు. గదిలో నేలపై ఏర్పాటుచేసిన  టైల్స్‌ అధికారులు మరింత నిశితంగా పరిశీలించగా ఓ మూలన ఉన్నది కొద్దిగా భిన్నంగా కనిపించింది.  తొలగించి చూస్తే  గోడలో ఉన్న రహస్య అర బయటపడింది. అందులో నుంచీ నగదు నింపిన గోనె సంచులు బయటపడ్డాయి. 

చనిపోయిందని ఏడ్చారు కానీ మమ్మీ రిటర్న్స్ ! ఈవిడ కథలో స్టన్నింగ్ సీక్రెట్స్ 

అదే ఒక వ్యాపార సంస్థ కార్యాలయం గోడలో  వెండి ఇటుకలు బయటపడ్డాయి. వాటితో పాటు సుమారు పదికోట్ల రూపాయల నగదు ( Rs 10 Crores Cash ) ఉన్నట్లు గుర్తించిన అధికారులు అవాక్కయ్యారు.   35 చదరపు అడుగుల కార్యాలయంలో రహస్యంగా దాచిన సుమారు రూ.10 కోట్ల విలువైన సొత్తును అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి బులియన్ వ్యాపారులు అత్యధిక మంది పన్నులు చెల్లించకుండా వ్యాపారాలుచేస్తూంటారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వందల కోట్ల టర్నోవర్ దాటిపోయినా జీఎస్టీ కట్టకుండా తప్పించుకోవడానికి... అడ్డగోలు ఆలోచనలు చేసి.. నిజంగానే బుక్కయ్యాడు చాముండా. సంపాదించినది మొత్తం ఇప్పుడు ఐటీ అధికారులు జప్తు చేశారు. 

Published at : 27 Apr 2022 03:16 PM (IST) Tags: Crime News Mumbai Businessman Chamunda Billion Silver Bricks in IT Attacks

సంబంధిత కథనాలు

Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు

Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం

Khammam: కానిస్టేబుల్ దంపతుల పాడుపని! ఏకంగా కోటిన్నర దోచేసిన భార్యాభర్తలు

Khammam: కానిస్టేబుల్ దంపతుల పాడుపని! ఏకంగా కోటిన్నర దోచేసిన భార్యాభర్తలు

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

టాప్ స్టోరీస్

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!

Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు