C M Nandini: బెంగళూరులో సీరియల్ నటి నందిని ఆత్మహత్య - ఆమె డైరీలో ఉన్న వాటితో సినిమానే తీయవచ్చు !
Bengalore: బెంగళూరులో నందిని అనే సీరియల్ నటి ఆత్మహత్య చేసుకున్నారు. తన మృతికి కారణాన్ని ఆమె డైరీలో నోట్ చేశారు.

Actress C M Nandini Suiside: కన్నడ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. వర్ధమాన నటి, 26 ఏళ్ల సి.ఎం. నందిని బెంగళూరులోని కెంగేరిలో ఉన్న తాను ఉంటున్న వసతి గృహంలో సోమవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుా భావిస్తున్నారు.కెరీర్ విషయంలో కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన ఒత్తిడి, మానసిక సంఘర్షణే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటన చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.
నందిని మృతి చెందిన ప్రదేశంలో పోలీసులకు ఆమె రాసిన ఒక డైరీ నోట్ లభ్యమైంది. అందులోని అంశాలు ఆమె అనుభవించిన మానసిక క్షోభను కళ్లకు కట్టే కథనం ఉంది. 2021లో తన తండ్రి మరణించిన తర్వాత, ఆమెకు ప్రభుత్వం నుంచి కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది. అయితే, ఆ ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదని, నటన , సృజనాత్మక రంగంపైనే తన ప్రాణం ఉందని ఆమె ఆ నోట్‌లో పేర్కొన్నారు.
Heartbreaking news from #Bengaluru 💔
— Ballari Tweetz (@TweetzBallari) December 30, 2025
Nandini CM (26) daughter of late S. Mahabaleshwar, a government school teacher & GR Basavarajeshwari, also a government teacher from #Kotturu #Vijayanagara dist was found dead by suicide at a PG accommodation in #Kengeri.
Kengeri Police have… pic.twitter.com/3Oafxr2NB8
నందిని నటనవైపు రావాలనుకున్నప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగంలోనే కొనసాగాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. తన కెరీర్ ఎంపికలను కుటుంబం అర్థం చేసుకోవడం లేదని, తనకు ఇష్టం లేని పనిని బలవంతంగా చేయాల్సి వస్తోందని ఆమె తన డైరీలో ఆవేదన వ్యక్తం చేశారు. కన్నడ టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆమె కలలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య జరిగిన ఈ పోరాటంలో ఆమె ఓడిపోయారు.
Heartbreaking News from Bengaluru 💔
— ಕನ್ನಡ್ವಿರಾಟ (@kohlificationn) December 29, 2025
Tragedy has struck the television industry as 26-year-old actress C.M. Nandini was found dead at her PG accommodation in Kengeri early Monday morning.
Investigations have uncovered a poignant diary note left behind by the actress. In it,… pic.twitter.com/AXmYyftAFm
నందిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె రాసిన డైరీ నోట్‌ను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలోనే ఎంతో భవిష్యత్తు ఉన్న నటి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం పట్ల ఆమె సహచర నటీనటులు మరియు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.





















