By: ABP Desam | Updated at : 26 Apr 2022 07:47 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొకైన్ సీజ్(ఫైల్ ఫొటో)
Shamshabad Drugs : డ్రగ్స్ స్మగ్లింగ్ రోజురోజుకూ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. పోలీసులు, అధికారులకు చిక్కకుండా ఉండేందుకు స్మగ్లర్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. వీడొక్కడే సినిమాలో చూపించినట్లు విగ్రహాల్లో డ్రగ్స్ కలిపి స్మగ్లింగ్ చేస్తున్నారు. మత్స్యకారుల బోటుల్లో దేశంలోకి డ్రగ్స్ తరలిస్తున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ ఎలా చేస్తారో సూర్య వీడొక్కడే సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమాలో డ్రగ్స్ క్యాప్సుల్స్‌ను మింగి, వాటిని కడుపులో పెట్టుకుని మలేషియాకు తరలిస్తారు. సేమ్ టూ సేమ్ అలాంటి ఘటనలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో వెలుగుచూసింది. కడుపులో డ్రగ్స్ క్యాప్సుల్స్ దాచుకొని హైదరాబాద్ వచ్చిన టాంజానియా వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్ట్ చేశారు.
రూ.12 కోట్ల కొకైన్ పట్టివేత
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. విదేశాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్న విదేశీయుడిని అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో సుమారు రూ.11.57 కోట్ల విలువైన కొకైన్ పట్టుకున్నారు అధికారులు. తనిఖీల్లో 1,157 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. టాంజానియా దేశానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ కు కొకైన్ తరలిస్తున్నట్లు సమాచారంతో అధికారులు తనిఖీలు చేశారు. ఆఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు పట్టుకున్నారు. కొకైన్ ను మాత్రల రూపంలోకి కడుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం 79 క్యాప్సూల్స్ ను DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
3.12 కిలోల హెరాయిన్ సీజ్
హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డీఆర్‌ఐ అధికారుల తనిఖీల్లో పెద్ద మొత్తంలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మహిళా ప్రయాణికురాలి వద్ద 3.12 కిలోల హెరాయిన్‌ను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ ఖతార్ నుంచి దోహా మీదుగా హైదరాబాద్ కు వచ్చింది. కస్టమ్స్ అధికారులకు అనుమానం రాకుండా హెరాయిన్‌ను రెండు కవర్స్‌లో చుట్టి ట్రాలీబ్యాగ్ కింది భాగంలో సీక్రెట్ గా అమర్చారు. ముందస్తు సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మహిళ ట్రాలీబ్యాగ్ తనిఖీ చేసిన డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఈ హెరాయిన్ విలువ సుమారు రూ.21.90 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం ప్రయాణికురాలిపై కేసు నమోదు చేశారు. నిందితురాలిని జుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో ఐదుగురు నిందితులు అరెస్టు
Jeedimetla News : ఇంట్లో దాచిన రూ.4 లక్షలు ఇరవై రోజుల్లో ఖర్చుపెట్టేసిన పిల్లలు
Husband Murder : 'మీ భర్తను ఎలా చంపాలి' అనే పుస్తకం రాసిన రచయిత్రి, ఆపై పక్కా ప్లాన్ తో భర్త మర్డర్!
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులపై ఫిర్యాదు !
Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్
CM Jagan Davos Tour Contro : దావోస్ కంటే ముందు జగన్ లండన్ వెళ్లారా? అసలు నిజం ఏమిటి ?
NSE Co-location Scam: ఎన్ఎస్ఈ స్కామ్‌లో కీలక పరిణామం - ట్రేడర్లు, బ్రోకర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు